Motorola Razr 50 Ultra: ఫ్లిప్ ఫోన్ కొనాలనుకుంటే ఇది గోల్డెన్ ఛాన్స్.. భారీ ఆఫర్..

ఈఎంఐ ఆప్షన్‌లో నెలకు రూ.2,407తో కొనొచ్చు.

Motorola Razr 50 Ultra: ఫ్లిప్ ఫోన్ కొనాలనుకుంటే ఇది గోల్డెన్ ఛాన్స్.. భారీ ఆఫర్..

Updated On : June 29, 2025 / 7:58 PM IST

ఫ్లిప్ ఫోన్ కొనాలనుకుంటున్నవాళ్లకు ఓ లిమిటెడ్ డీల్ ఆఫర్ అందుబాటులో ఉంది. మోటోరోలా టెక్ బ్రాండ్ నుంచి Razr 50 Ultra ఫ్లిప్ ఫోన్ తక్కువ ధరకు దొరుకుతోంది. ఈ ఫోన్‌ను సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో కొనొచ్చు.

డిస్కౌంట్ వివరాలు
Motorola Razr 50 Ultra 5G 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఆర్పీ రూ.1,19,000. ఫ్లిప్‌కార్ట్‌లో 42 శాతం డిస్కౌంట్‌తో ధర రూ.68,449కు అందుబాటులో ఉంది.

బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఐడీఎఫ్‌సీ డెబిట్ కార్డుపై రూ.750 తగ్గుతుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఇవ్వడం లేదు. ఈఎంఐ ఆప్షన్‌లో నెలకు రూ.2,407తో కొనొచ్చు. ఈ డీల్ త్వరలోనే ముగిసే అవకాశం ఉంది.

Also Read: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేస్తే..

ఫీచర్లు
ఫోన్ 4-ఇంచ్ ఎల్‌టీపీ కవర్ డిస్‌ప్లే, 6.9-ఇంచ్ ఇన్నర్ డిస్‌ప్లేతో వచ్చింది. 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంది. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ లభిస్తుంది.

కెమెరా సెటప్‌లో 50ఎంపీ డ్యూయల్ కెమెరా, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 4000ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

NOTE: ఆన్‌లైన్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న వస్తువుల ధరలు మారుతూ ఉంటాయి. కొనే సమయంలో ధరలను పరిశీలించాలి. ఈ ఆర్టికల్ రాసే సమయానికి Motorola Razr 50 Ultraపై ఆఫర్ అందుబాటులో ఉంది.