Samsung Galaxy S25 FE : స్పెషల్ ఆఫర్‌తో కొత్త శాంసంగ్ ఫోన్ వచ్చేసింది.. AI ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

Samsung Galaxy S25 FE : కొత్త శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ వచ్చేసింది. సరికొత్త ఏఐ ఫీచర్లతో స్పెషల్ ఆఫర్ కలిగి ఉంది. ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy S25 FE

Samsung Galaxy S25 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం సరికొత్త శాంసంగ్ 5G ఫోన్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫ్లాగ్‌షిప్ S25 సిరీస్‌ లేటెస్ట్ వన్ యూఐ 8 ఆపరేటింగ్ సిస్టమ్, కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తుంది.

4,900mAh బ్యాటరీ, అప్‌గ్రేడ్ వేపర్ చాంబర్, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. శాంసంగ్ (Samsung Galaxy S25 FE) ఫోన్‌లో 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S25 FE భారత్ ధర, లభ్యత :
8జీబీ + 128 జీబీ నేవీ, జెట్‌బ్లాక్, వైట్ రూ. 59,999
8 జీబీ + 256 జీబీ నేవీ, జెట్‌బ్లాక్, వైట్ రూ. 65,999
8 జీబీ + 512 జీబీ నేవీ, జెట్‌బ్లాక్, వైట్ రూ. 77,999

శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ సెప్టెంబర్ 29 నుంచి (Samsung.com)లో శాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్‌లలో ఎంపిక చేసిన అధీకృత రిటైల్ స్టోర్‌లలో వివిధ ఆన్‌లైన్ పోర్టల్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ కూడా ఒక స్పెషల్ ప్రమోషన్‌ను అందిస్తోంది. రూ.12వేలు స్టోరేజ్ అప్‌గ్రేడ్ కలిగి ఉంది. కొనుగోలుదారులు 256GB మోడల్ ధరకే 512GB వేరియంట్‌ పొందవచ్చు. కస్టమర్‌లు అదనంగా రూ.5వేలు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : iOS 26 Update : ఐఫోన్ లవర్స్‌ కోసం iOS 26 అప్‌డేట్.. పాత ఐఫోన్లకు సపోర్టు.. ఎలా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలంటే?

శాంసంగ్ గెలాక్సీ S25 FE స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వన్ యూఐ 8పై రన్ అవుతుంది. 7 ఏళ్ల ఆండ్రాయిడ్ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందుకుంటుంది.

ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ :
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 50MP వైడ్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ పొందవచ్చు.

బ్యాటరీ, డిజైన్ :

ఈ శాంసంగ్ ఫోన్ 4,900mAh బ్యాటరీతో వస్తుంది. 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ అందిస్తుంది.

అడ్వాన్స్ ఏఐ ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 FE కూడా అనేక ఏఐ ఫీచర్లతో వస్తుంది. జనరేటివ్ ఎడిట్ ఫొటోలతో బ్యాక్ గ్రౌండ్ ఆటోమాటిక్‌గా గుర్తించి డిలీట్ చేస్తుంది. పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్ యూజర్లకు మరింత రియల్ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ కస్టమైజడ్ అవతార్‌లను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది.

అదనంగా, ఆడియో ఎరేజర్, మ్యూజిక్, ఎయిర్, నేచర్ సౌండ్, క్రౌడ్ నాయిజ్, బ్యాక్ గ్రౌండ్ ఇంటర్ ఫీయరెన్స్ వంటి ఆడియో ఎలిమెంట్స్ సపరేట్ చేయడం ద్వారా వీడియోల నుంచి నాయిజ్ రిమూవ్ చేయొచ్చు.