Samsung Galaxy S26 Series : భారీ ఫీచర్లతో శాంసంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Samsung Galaxy S26 Series : కొత్త శాంసంగ్ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా మోడల్స్ లాంచ్ కానున్నాయి.. పూర్తి ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..
Samsung Galaxy S26 Series
- శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా
- డిస్‌ప్లే సైజులు, కెమెరా సెటప్ నుంచి బ్యాటరీ అప్‌గ్రేడ్ ఆప్షన్లు
- 6.7-అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండొచ్చు
- శాంసంగ్ గెలాక్సీ S26 ప్రారంభ ధర రూ.84,999గా ఉండొచ్చు
Samsung Galaxy S26 Series : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి భారీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రాబోతున్నాయి. అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. రాబోయే లైనప్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, టాప్-ఎండ్ గెలాక్సీ S26 అల్ట్రాతో మొత్తం 3 మోడల్స్ రిలీజ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.
లీక్ డేటాను పరిశీలిస్తే.. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఫోన్ల డిస్‌ప్లే సైజులు, కెమెరా సెటప్ నుంచి బ్యాటరీ అప్‌గ్రేడ్‌లు ఉండనున్నాయి. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ధరలు, ఫీచర్లు ఎలా ఉండనున్నాయో పూర్తి వివరాలతో ఇప్పడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ స్మార్ట్‌ఫోన్‌కు పవర్ అందిస్తుంది. 16GB వరకు ర్యామ్, 1TB స్టోరేజీతో వస్తుంది.
5400mAh యూనిట్, వైర్డు ఛార్జింగ్‌తో బ్యాటరీ బంప్ కూడా ఉండొచ్చు. కెమెరా వారీగా అల్ట్రా 200MP మెయిన్ సెన్సార్‌తో క్వాడ్ రియర్ సెటప్ అందిస్తుంది. అల్ట్రా-వైడ్ లెన్స్ 2 జూమ్ కెమెరాలు సపోర్టు ఇస్తాయి. ఫ్రంట్ సైడ్ శాంసంగ్ 12MP సెల్ఫీ కెమెరాతో రావొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ లీక్స్ :
శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ ఇన్-హౌస్ చిప్‌సెట్, క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లో రన్ కావచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4900mAh బ్యాటరీతో రానుంది. కెమెరాల విషయానికి వస్తే.. 50MP మెయిన్ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్ 3x టెలిఫోటో జూమ్ కెమెరాతో పాటు 12MP ఫ్రంట్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ సెటప్ ఉండొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S26 ఫీచర్లు లీక్ :
శాంసంగ్ గెలాక్సీ S26 బేస్ మోడల్ 6.3-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని అంచనా. మార్కెట్‌ను బట్టి ఎక్సినోస్ చిప్ లేదా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రావొచ్చు.
బ్యాటరీ సైజు కూడా దాదాపు 4300 mAh ఉంటుందని అంచనా. కెమెరా సెటప్ కూడా 50MP మెయిన్ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్ 3x జూమ్ టెలిఫోటో కెమెరాతో శాంసంగ్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. ఫ్రంట్ కెమెరా 12MP యూనిట్‌గా ఉంటుందని భావిస్తున్నారు.
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ తేదీ ధర (అంచనా) :
రిపోర్టుల ప్రకారం.. ఫిబ్రవరి 25, 2026న శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026ను నిర్వహించనుంది. దేశీయ మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్ల లాంచ్ కూడా దాదాపు అదే సమయంలో జరగవచ్చు. ఆ తర్వాత శాంసంగ్ కొత్త ఫోన్‌లు మార్చి ప్రారంభంలో అమ్మకానికి రావచ్చు.
భారత మార్కెట్లో ధర విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 దాదాపు రూ.84,999 నుంచి ప్రారంభం కానుంది. అయితే, శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ రూ.1,04,999 వరకు లాంచ్ అయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా దాదాపు రూ.1,34,999 ధరకు లాంచ్ అవుతుందని అంచనా. శాంసంగ్ అధికారిక ధర లాంచ్ సమయంలో మాత్రమే వెల్లడి కానుంది.
