Vivo V70 Series : వివో లవర్స్ గెట్ రెడీ.. వివో V70 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V70 Series Launch : వివో V70 సిరీస్ వచ్చే నెలలో రాబోతుంది. ఈ కొత్త లైనప్‌లో వివో V70, వివో V70 ఎలైట్, వివో V70 FE మోడల్ ఉండవచ్చు.

Vivo V70 Series : వివో లవర్స్ గెట్ రెడీ.. వివో V70 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V70 Series Launch

Updated On : January 26, 2026 / 2:43 PM IST
  • వివో నుంచి సరికొత్త వివో V79 సిరీస్ రాబోతుంది
  • 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరెన్నో ఫీచర్లు
  • ఫిబ్రవరి 15 వివో V70 సిరీస్ రిలీజ్ అయ్యే ఛాన్స్
  • జనవరి 27న వివో X200T మోడల్ లాంచ్

Vivo V70 Series Launch : వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. భారత మార్కెట్లో జనవరి 27న వివో X200T మోడల్ లాంచ్ కానుంది. లేటెస్ట్ లీక్‌ల ప్రకారం.. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు భారీ మిడ్-ప్రీమియం ఫోన్ లాంచ్ Vivo V70 సిరీస్‌ను అతి త్వరలో రిలీజ్ చేయనుంది.

వచ్చే నెల ఫిబ్రవరిలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్‌లో వివో V70, వివో V70 ఎలైట్‌ మోడల్స్ ఉండే ఛాన్స్ ఉంది. వివో V70 FE మోడల్ కూడా అదే సమయంలో లాంచ్ చేస్తుందని రుమర్లు వస్తున్నాయి. వివో ఈ ఫోన్ల లాంచ్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. కానీ, BISలో వివో ఎలైట్ వేరియంట్ కనిపించింది. భారత్‌లో కూడా ఈ వివో మోడల్లాం చ్ అవుతుందని భావిస్తున్నారు.

వివో V70, వివో V70 ఎలైట్ స్పెసిఫికేషన్లు (అంచనా)
లీక్స్ ప్రకారం, Vivo V70 Vivo V70 Elite రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తాయని, రెండు ఫోన్‌ల పనితీరులో తేడా ఉండవచ్చు. Vivo V70 Elite స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చని, స్టాండర్డ్ Vivo V70 స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌తో రావచ్చని తెలుస్తోంది.

వివోలైనప్ అంతటా కెమెరా హార్డ్‌వేర్‌ను స్టేబుల్ ఉంచవచ్చు. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరాతో వస్తంది. టెలిఫోటో ZEISS బ్రాండింగ్‌ కూడా ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్‌పై అద్భుతమైన డీల్.. ఇలా కొన్నారంటే రూ. 23వేలు డిస్కౌంట్.. ఎంతకు వస్తుందంటే?

వివో V70, వివో V70 ఎలైట్ డిజైన్, కలర్ ఆప్షన్లు :

లీకుల ప్రకారం.. ఈ రెండు వివో ఫోన్‌లు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. డిజైన్ చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌ 3 లెన్స్‌లతో పాటు LED ఫ్లాష్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్లలో ఫ్రంట్ సైడ్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా, స్లిమ్ బెజెల్స్ ఉంటాయి.

కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. వివో V70 ప్యాషన్ రెడ్, లెమన్ ఎల్లో కలర్ ఆప్షన్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వివో V70 ఎలైట్ ప్యాషన్ రెడ్, సాండ్ బీజ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రావచ్చు.

భారత్‌లో వివో V70 సిరీస్ ధర లాంచ్ తేదీ (అంచనా) :
ప్రస్తుత రిపోర్టు ప్రకారం.. వివో V70 సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 మధ్య భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర పరంగా పరిశీలిస్తే.. వివో V70 సిరీస్ భారత మార్కెట్లో రూ. 45వేల నుంచి రూ. 55వేల మధ్య ఉంటుందని అంచనా.