Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. ఈ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ధర, ఫుల్ ఫీచర్లు లీక్..

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ ధర, భారత్ లాంచ్ డేట్, ఫుల్ స్పెషిఫికేషన్లు, డిజైన్, ఇతర ఫీచర్లు లీక్ అయ్యాయి.

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. ఈ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ధర, ఫుల్ ఫీచర్లు లీక్..

Samsung Galaxy S26 Ultra

Updated On : October 21, 2025 / 11:20 AM IST

Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రాబోతుంది. ఇప్పుడు కాదండోయ్.. జనవరి 2026లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించి ఎప్పటిలాగే లీక్‌లు, పుకార్లు బయటకు వచ్చాయి. కానీ, ఈసారి ట్విస్ట్ అదిరింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ తక్కువ సేల్స్ కారణంగా “ఎడ్జ్” మోడల్‌కు బైబై చెప్పవచ్చని తెలుస్తోంది.

ఆన్‌లైన్‌లో లీక్‌ల ప్రకారం.. నెక్స్ట్ జనరేషన్ (Samsung Galaxy S26 Ultra) లైనప్‌లో 3 మోడల్‌లు ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ S26, శాంసంగ్ గెలాక్సీ S26 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మోడల్స్ ఉన్నాయి. ఈ మూడూ అప్‌గ్రేడ్‌లతో పాటు శాంసంగ్ అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S26 అల్ట్రాపై ఫోకస్ పెట్టింది. డిజైన్, డిస్‌ప్లే, కెమెరాతో భారత మార్కెట్లో ధరకు సంబంధించి ఇప్పటివరకూ లీకైన డేటా వివరాలను పరిశీలిద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్పెసిఫికేషన్లు (అంచనా) :
రాబోయే శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది. అయితే, శాంసంగ్ కొద్దిపాటి అప్‌గ్రేడ్స్ మాత్రమే చేసింది. లీక్‌ల ప్రకారం.. శాంసంగ్ సన్నని ప్రొఫైల్‌ S25 అల్ట్రా కన్నా 0.4mm సన్నగా ఉంటుంది. ఫ్లోటింగ్ కెమెరా అత్యంత ఆకర్షణగా ఉండనుంది. ఈసారి భారీ సెన్సార్‌లను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.9-అంగుళాల M14 OLED ప్యానెల్‌ కలర్-ఆన్-ఎన్‌క్యాప్సులేషన్ (CoE) టెక్నాలజీతో వస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త డిస్‌ప్లే 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

Read Also : iQOO 15 Launch : కొత్త ఐక్యూ 15 వచ్చేసిందోచ్.. కెమెరా ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.. ఫుల్ డిటెయిల్స్!

టెక్ దిగ్గజం “ఫ్లెక్స్ మ్యాజిక్ పిక్సెల్” ప్రైవసీ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌పై రన్ అవుతుందని భావిస్తున్నారు. థర్మల్ మేనేజ్‌మెంట్ భారీ అప్‌గ్రేడ్స్ అందిస్తుందని భావిస్తున్నారు. గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ కోసం కొత్త అడ్రినో 840 జీపీయూతో రానుంది. 12GB LPDDR5X ర్యామ్, 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లతో రానుంది. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 5000mAh యూనిట్‌తో రావొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కెమెరా అప్‌గ్రేడ్‌లు (అంచనా) :

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 200MP ప్రైమరీ సెన్సార్ (1/1.1-అంగుళాల సోనీ లెన్స్), 50MP అల్ట్రావైడ్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 3x జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్‌తో వచ్చు. సెల్ఫీ షూటర్ 12MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. కానీ, ఈసారి మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్, ఏఐ అప్‌గ్రేడ్స్ కూడా ఉండొచ్చు.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర, లాంచ్ తేదీ (అంచనా) :
ప్రారంభ లీక్‌ల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5G ఫోన్ భారత మార్కెట్లో బేస్ 12GB ర్యామ్ + 256GB మోడల్‌ దాదాపు రూ. 1,34,999 ప్రారంభ ధర కలిగి ఉండవచ్చు. హై స్టోరేజ్ వేరియంట్‌లు (512GB+1TB) ఎక్కువ ధర ఉండొచ్చు. లీక్‌లను పరిశీలిస్తే.. 2026 జనవరి 20 నుంచి జనవరి 28 మధ్య శాంసంగ్ మొత్తం S26 లైనప్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.