iQOO 15 Launch : కొత్త ఐక్యూ 15 వచ్చేసిందోచ్.. కెమెరా ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.. ఫుల్ డిటెయిల్స్!
iQOO 15 Launch : కొత్త ఐక్యూ 15 ఫోన్ చైనాలో లాంచ్ అయింది. అతి త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ధర, కీలక ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

iQOO 15 Launch
iQOO 15 Launch : కొత్త ఐక్యూ ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ 15 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. చైనాలో అధికారికంగా ఐక్యూ 15 లాంచ్ అయింది. అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లతో స్క్విర్కిల్ కెమెరా సెటప్‌తో చైనా మార్కెట్లోకి అడుగుపెట్టింది.
ఎప్పటిలానే ఐక్యూ బ్యాక్ సైడ్ మార్బల్ ఎండ్‌తో (iQOO 15 Launch) స్పెషల్ డిజైన్ కలిగి ఉంది. ఈ ఐక్యూ ఫోన్ అతి త్వరలో భారత మార్కెట్లోకి కూడా రానుంది. ఐక్యూ 15 ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, అంచనా ధరకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐక్యూ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐక్యూ 15 ఫోన్ 6.85-అంగుళాల 2K+ కర్వ్డ్ శాంసంగ్ M14 8T ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, HDR10 సర్టిఫికేషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. నేరుగా సూర్యకాంతిలో కూడా డిస్‌ప్లే బ్రైట్‌నెస్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అడ్రినో 840 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. భారీ గేమ్‌ల కోసం ఐక్యూ Q3 గేమింగ్ చిప్ కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా OriginOs 6.0పై రన్ అవుతుంది.
కెమెరా ఐలాండ్ బ్యాక్ సైడ్ ఆర్జీబీ లైటింగ్ గేమింగ్, మ్యూజిక్, నోటిఫికేషన్లు వంటివి ఉన్నాయి. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ 15 ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 3x జూమ్, OISతో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంది. 100W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 7000mAh బ్యాటరీ కలిగి ఉంది.
భారత్‌లో ఐక్యూ 15 ధర (అంచనా) :
ఐక్యూ 15 ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో చైనా మార్కెట్లో CNY 4,199కు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 55వేల నుంచి రూ. 60వేల మధ్య ధర ఉంటుందని అంచనా. ఈ ఫోన్ చైనా మార్కెట్లో లెజెండరీ ఎడిషన్, వైల్డర్‌నెస్, ట్రాక్ ఎడిషన్, లింగ్యున్ అనే 4 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో కూడా ఇదే 4 కలర్ ఆప్షన్లలో రావొచ్చు.