Samsung Galaxy S26 Ultra : 6G నెట్‌వర్క్ స్పీడ్‌తో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వస్తోంది.. లాంచ్ తేదీ, ధర, కెమెరా ఫీచర్లు లీక్..!
Samsung Galaxy S26 Ultra : రాబోయే కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ లాంచ్ తేదీ, భారత్ ధర, కెమెరా, స్పెసిఫికేషన్ల వివరాలు లీక్ అయ్యాయి.

Samsung Galaxy S26 Ultra
Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ రాబోతుంది. వచ్చే 2026 జనవరిలో ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది. 16GB ర్యామ్ (Samsung Galaxy S26 Ultra) వేరియంట్ ధర రూ. 1,59,990 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉండొచ్చు. ప్రత్యేకించి 6G స్పీడ్ నెట్‌వర్క్ టెక్నాలజీతో రానుంది. లీక్‌ల ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..
అల్ట్రా ధర, లాంచ్ తేదీ (అంచనా) :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S25 ఎడ్జ్, గెలాక్సీ S26 అల్ట్రా వంటి శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌లు జనవరి 2026 నాటికి మార్కెట్లోకి లాంచ్ అవుతాయని అంచనా. ధరల విషయానికి వస్తే.. గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 16GB ర్యామ్ వేరియంట్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 1,59,990 ప్రారంభ ధరకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ లాంచ్ సమయంలో అధికారిక ధరలు మరోలా ఉండొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కెమెరా, డిజైన్, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫుల్ బ్యాక్ ప్యానెల్ రీడిజైన్ కలిగి ఉండొచ్చు. లీక్‌ల ప్రకారం.. ఫోన్‌లో ఫ్లోటింగ్ లెన్స్ కెమెరా అలైన్‌మెంట్ ఉండదు. సింగిల్ కెమెరా ఐలాండ్ లెన్స్‌లు ఉండొచ్చు. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7కు సమానంగా ఉంటుంది.
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ TSMC 3nm ప్రాసెస్ ఆధారంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. గత వెర్షన్‌తో పోలిస్తే ఈ శాంసంగ్ ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కలిగి ఉంది. గెలాక్సీ S25 అల్ట్రా కన్నా ఫోన్‌లో బిగ్ వేపర్ చాంబర్ (సుమారు 20శాతం ఎక్కువ) ఉంటుందని అంచనా. ఈ హ్యాండ్‌సెట్ 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5500mAh బ్యాటరీని కూడా పొందవచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈసారి, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లో 200MP ISOCELL సెన్సార్, 200MP సోనీ సెన్సార్‌తో రావచ్చు. బ్యాక్ మరో 3 సెన్సార్లు ఉంటాయి. 50MP అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్, 50MP పెరిస్కోప్ లెన్స్, 12MP టెలిఫోటో షూటర్ కూడా ఉంది.