BSNL Recharge Plans : BSNL బంపర్ ఆఫర్.. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అదుర్స్.. అన్‌లిమిటెడ్ కాల్స్.. 336 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!
BSNL Recharge Plans : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. 336 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్‌కాల్స్ పొందవచ్చు.

BSNL
BSNL Recharge Plans : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. BSNL రూ.1499 ధరకు 336 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద (BSNL Recharge Plans) అన్‌లిమిటెడ్ కాల్స్, మొత్తం 24GB డేటా, 100 రోజువారీ SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. కాలింగ్, మెసేజింగ్ కోసం రోజుకు రూ.5 కన్నా తక్కువ ఖర్చు చెల్లించాలి. దీర్ఘకాలిక కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్యాక్‌తో సబ్‌స్క్రైబర్‌లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్, మొత్తం వ్యాలిడిటీకి 24GB డేటాను పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ లేదు. కానీ, డేటా కేటాయింపుతో భారీ ఇంటర్నెట్ యూజర్లకు అదనపు డేటా పొందవచ్చు.
కాలింగ్, మెసేజింగ్ యూజర్లకు బెస్ట్ :
ఈ ప్లాన్ ఇంటర్నెట్ వాయిస్ కాల్స్, SMS కోసం BSNL నంబర్‌ను ఉపయోగించే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. రోజుకు రూ.5 కన్నా తక్కువ ధరతో భారత్ అత్యంత సరసమైన లాంగ్ కాలింగ్ ప్లాన్‌లలో ఒకటి. రీఛార్జ్‌లను BSNL వెబ్‌సైట్ లేదా సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా చేయవచ్చు.
నెట్‌వర్క్ విస్తరణపై BSNL ఫోకస్ :
వీక్ కనెక్టివిటీపై దీర్ఘకాలిక ఫిర్యాదులతో BSNL మౌలిక సదుపాయాలలో భారీగా పెట్టుబడి పెడుతోంది. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ ఇటీవల భారత్ అంతటా లక్ష కొత్త 4G/5G టవర్లను ఏర్పాటు చేసింది. అతి త్వరలో మరో లక్ష టవర్లను చేర్చాలని యోచిస్తోంది.
ఈ అప్‌గ్రేడ్‌లు బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో కాల్ డ్రాప్స్, స్లో ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నాయి. మెరుగైన కవరేజ్ BSNL బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్లను ఎంచుకునే యూజర్లకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
మార్కెట్ ప్రభావం :
ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అధిక ధరలకు ప్లాన్లను అందిస్తూ తక్కువ వ్యాలిడిటీని ఆఫర్ చేస్తున్నాయి. BSNL రూ.1,499 ప్లాన్ ద్వారా గట్టి పోటినిస్తోంది. సరసమైన ధరలో లాంగ టైమ్ వ్యాలిడిటీ కోసం చూస్తున్న యూజర్లను ఆకర్షిస్తుంది. దాంతో టెలికం పోటీదారులు సైతం రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించాల్సి రావచ్చు.
ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల కారణంగా భారత మార్కెట్లో అత్యాధునిక పోటీ నెలకొంది. బీఎస్‌ఎన్‌ఎల్ సరసమైన ధరలో బెస్ట్ ప్లాన్లను అందించే లక్ష్యంతో భారతీయ మార్కెట్లో సర్వీసులను మరింత పెంచుకునే దిశగా ప్రయత్నిస్తోంది.