Reliance Jio : జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో ఫ్రీగా Netflix సబ్‌స్క్రిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి
Reliance Jio : జియో రీఛార్జ్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో అద్భుతమైన షోలు, మూవీలను వీక్షించవచ్చు. జియో అందించే రీఛార్జ్ ఆఫర్లను ఓసారి లుక్కేయండి.

Reliance Jio
Reliance Jio : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అదనపు డబ్బు చెల్లించకుండా నెట్‌ఫ్లిక్స్‌లో ఇష్టమైన షోలు, సినిమాలను చూడాలనుకుంటే రిలయన్స్ జియో (Reliance Jio) అద్భుతమైన ఆఫర్ పొందవచ్చు. ఇప్పుడు జియో కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బిల్లు అవసరం లేదు. రీఛార్జ్ చేసిన వెంటనే స్ట్రీమింగ్ యాక్సస్ పొందవచ్చు.
ఒకే ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ :
నెట్‌ఫ్లిక్స్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ సపరేట్‌గా తీసుకోవాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, జియో ఈ ప్రత్యేక ప్లాన్‌లతో మొబైల్ రీఛార్జ్, నెట్‌ఫ్లిక్స్ అన్ని కలిసి వస్తాయి. మీరు జియోటీవీ, జియోక్లౌడ్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.
రూ.1,299 ప్లాన్ :
వ్యాలిడిటీ : 84 రోజులు
మొత్తం డేటా : 168GB (రోజుకు 2GB)
ఇతర బెనిఫిట్స్ : అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్
బోనస్ : నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ, జియోక్లౌడ్ యాక్సెస్
ఎక్కువ డేటా లేకుండా రోజూ స్ట్రీమ్ యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్.
రూ.1,799 ప్లాన్ (Reliance Jio) :
వ్యాలిడిటీ : 84 రోజులు
మొత్తం డేటా : 252GB (రోజుకు 3GB)
ఇతర బెనిఫిట్స్ : అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS
బోనస్ : నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, జియోటీవీ, జియోక్లౌడ్ యాక్సెస్
మీరు ఎక్కువగా స్ట్రీమింగ్, గేమింగ్, వీడియో కాలింగ్ లేదా భారీ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయొచ్చు.
ఈ ఆఫర్ ఎలా పొందాలంటే? :
మైజియో యాప్, జియో వెబ్‌సైట్ లేదా ఏదైనా ఇష్టమైన పేమెంట్ యాప్ నుంచి రూ.1,299 లేదా రూ.1,799కి రీఛార్జ్ చేసుకోండి. రీఛార్జ్ యాక్టివేట్ తర్వాత మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ లింక్ చేయండి. వెంటనే స్ట్రీమింగ్ ఎనేబుల్ చేయండి. ఇతర జియో ప్లాన్‌లలో జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి సబ్‌స్క్రిప్షన్ ఆఫర్లను కూడా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ప్లాన్‌లలో (Reliance Jio) నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ :
రూ. 181 ప్లాన్ :
ఎయిర్‌టెల్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ కేవలం రూ.181కే లభిస్తోంది. 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 15GB డేటాను పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సభ్యత్వం అందుబాటులో ఉంది. సోనీ లివ్, హోయిచోయ్, లయన్స్‌గేట్ ప్లే, సన్ NXT, చౌపాల్ వంటి 22 కన్నా ఎక్కువ OTT ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది.
రూ. 451 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో యూజర్లు మొత్తం 50GB డేటాను పొందవచ్చు. 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా (హాట్‌స్టార్)కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. జియో యూజర్లు క్రికెట్ మ్యాచ్‌ల నుంచి బాలీవుడ్ మూవీల వరకు అన్ని వీక్షించవచ్చు.