పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లు కావాలనుకునేవారికి ఫోల్డబుల్ ఫోన్లు మంచి ఆప్షన్. చాలా సౌలభ్యంగా ఉంటాయని చాలా మంది వీటిని కొంటుంటారు. యూజర్ల ఆసక్తికి తగ్గట్లే స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీలు వీటిని తీసుకొస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సిరీస్ యూజర్లను బాగా ఆకర్షిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 త్వరలోనే విడుదల కానుంది. ఫోల్డబుల్ ఫోన్లు కొనాలనుకునేవారు దీని కోసం ఎదురుచూస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఫీచర్లను, లాంచ్ తేదీ గురించి ఆ కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ లీక్‌ల ద్వారా వాటి వివరాలు తెలిశాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2025 జులైలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
Also Read: మిడ్ రేంజ్ బడ్జెట్‌లో పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్.. అబ్బబ్బ ఎన్నెన్ని ప్రత్యేకతలో..
ఫీచర్లు
గెలాక్సీ ఫ్లిప్ 7.. 3.6-అంగుళాల కవర్ డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. మెయిన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ లేదా శాంసంగ్ ఎక్సినోస్ 2500 చిప్‌సెట్ ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM, 512GB స్టోరేజ్‌తో రావచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో సామర్థ్యంతో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఫొటోగ్రఫీ కోసం గెలాక్సీ ఫ్లిప్ 7లో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్‌లో 10MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. డిజైన్ విషయానికి వస్తే… Z Flip 7 డిజైన్ Z Flip 6 లాగే ఉండొచ్చు. చిన్న చిన్న అప్‌గ్రేడ్‌లతో రావచ్చు. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7.. 9.1mm తిక్‌నెస్‌తో రావచ్చని తెలుస్తోంది. గెలాక్సీ ఫ్లిప్ 7 ధర భారత్‌లో రూ.1,09,999 ఉండొచ్చు.