Samsung Galaxy Z Fold 7 Enterprise Edition
Samsung Galaxy Z Fold 7 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్ డివైజ్‌ల్లో ఒకటైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ జర్మనీలో (Samsung Galaxy Z Fold 7) లాంచ్ అయింది. ఎంటర్‌ప్రైజెస్ లేటెస్ట్ వేరియంట్ త్వరలో ఇతర మార్కెట్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ వెబ్‌సైట్‌లో సింగిల్ కలర్ స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. స్టాండర్డ్ మోడల్ (Samsung Galaxy Z Fold 7 Enterprise Edition) మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంది. కానీ, ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తుంది. ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ శాంసంగ్ నాక్స్ సూట్‌కు ఒక ఏడాది ఫ్రీ యాక్సెస్‌తో కూడా వస్తుంది. ముఖ్యంగా, స్టాండర్డ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 జూలైలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 FEలతో పాటు ఆవిష్కరించింది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ ఫోన్ జెట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యం కానుంది. శాంసంగ్ జర్మనీ వెబ్‌సైట్ ద్వారా సింగిల్ 512GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర ఇంకా వెల్లడి కాలేదు. సాధారణంగా ఎంటర్‌ప్రైజ్‌లకు అందుబాటులో ఉంటుంది.
స్టాండర్డ్ మోడల్ మాదిరిగా కాకుండా గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ 3 ఏళ్ల వారంటీతో వస్తుంది. కంపెనీలు అదనపు ఖర్చు లేకుండా డివైజ్ మేనేజ్ కోసం కోసం ఒక ఏడాది ఉచితంగా శాంసంగ్ నాక్స్ సూట్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 మోడల్ 12GB + 256GB ధర రూ. 1,74,999గా నిర్ణయించగా, 12GB + 512GB, 16GB + 1TB కాన్ఫిగరేషన్ ధర వరుసగా రూ. 1,86,999, రూ. 2,16,999గా నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్ బ్లూ షాడో, జెట్‌బ్లాక్, సిల్వర్ షాడో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్‌లో ఫీచర్లు ఇవే :
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
AI, సెక్యూరిటీ ఫీచర్లు :