Samsung Galaxy S25 Ultra : ఐఫోన్ రేంజ్ ఫీచర్లు బ్రో.. ఈ శాంసంగ్ S25 అల్ట్రాపై కిర్రాక్ డిస్కౌంట్.. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్..!
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ధర తగ్గిందోచ్.. ఐఫోన్ రేంజ్ ఫీచర్లు కలిగిన ఈ శాంసంగ్ ఫోన్ అసలు వదులుకోవద్దు..

Samsung Galaxy S25 Ultra
Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? అయితే, ఈ అదిరిపోయే ఆఫర్ మీకోసమే.. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ (Samsung Galaxy S25 Ultra) సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం అనేక స్మార్ట్ ఫోన్లపై దిమ్మతిరిగే ఆఫర్లను అందిస్తోంది. అందులో ఈ ప్రీమియం శాంసంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
200MP కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ఇప్పుడు అసలు ధర (Samsung Galaxy S25 Ultra price drop) కన్నా అతి తక్కువ ధరకే లభిస్తోంది. వాస్తవానికి, ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గత జనవరిలో లాంచ్ కాగా ప్రారంభ ధర రూ.1,29,999గా ఉంది. కానీ, ఇప్పుడు రూ.44,500 తగ్గింపు ధరతో లభ్యవుతుంది. ప్రత్యేకించి ఐఫోన్ యూజర్లు (iPhone users) ఈ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ అసలు వదులుకోవద్దు..
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా డిస్కౌంట్ :
అమెజాన్ ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై 17 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో రూ.1,07,999కి అందుబాటులో ఉంది. అదనంగా, రూ.47,150 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ దగ్గర పాత ఐఫోన్ 13 ఉందా? శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కోసం ఎక్స్ఛేంజ్ కావాలంటే మీరు రూ.22,650 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.85,349 కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. అయితే, కచ్చితమైన వాల్యూ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫీచర్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 3120 x 1440 పిక్సెల్స్ (Samsung Galaxy S25 Ultra) రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల పెద్ద డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే క్వాడ్ HD+ రిజల్యూషన్, 120Hz హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో వస్తుంది. 5000mAh బ్యాటరీతో 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టు ఇస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OneUI 7పై రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ S-పెన్ సపోర్ట్ కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్ కలిగి ఉంది. నీటిలో తడిసినా తట్టుకుంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. Wi-Fi, 5G, బ్లూటూత్, NFC వంటి ఫీచర్లను అందిస్తుంది.