Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, ప్రీ-ఆర్డర్ వివరాలివే..!

Samsung Galaxy Z Fold 7 : కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? లాంచ్ డేట్, ప్రీ ఆర్డర్, బెనిఫిట్స్ వంటి పూర్తి ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

Samsung Galaxy Z Fold 7

Samsung Galaxy Z Fold 7 : కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కావాలా? శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను వచ్చే నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE వంటి నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్‌ ఫోన్లను ప్రవేశపెట్టనుందని భావిస్తున్నారు.

కంపెనీ ఇప్పటికే భారత మార్కెట్లో ప్రీ-రిజర్వేషన్ ఆఫర్లను ప్రారంభించింది. శాంసంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ల కోసం చూస్తున్నవారు ముందుగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ ఎప్పుడు అనేది తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ప్రీ-రిజర్వేషన్ :
శాంసంగ్ అధికారికంగా ప్రీ-రిజర్వేషన్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రీ-రిజర్వేషన్ పేజీని లిస్టు చేసింది. రాబోయే ఫోల్డబుల్స్, గెలాక్సీ వాచ్ 8 సిరీస్, కొత్త TWS ఇయర్‌బడ్‌లకు సంబంధించి స్కెచ్‌లను రివీల్ చేసింది.

మీరు ఈ శాంసంగ్ ఫోన్ కోసం ముందస్తుగా రిజర్వ్ చేయాలనుకుంటే.. కస్టమర్లు శాంసంగ్ షాప్ లేదా ఆఫ్‌లైన్ పార్టనర్లను సంప్రదించి రూ.1,999 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు. కస్టమర్లు రూ.5,999 వరకు విలువైన గ్యారెంటీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇ-స్టోర్ వోచర్ రూపంలో వస్తుంది. కస్టమర్లు కొత్త గెలాక్సీ డివైజ్ కార్ట్‌కు యాడ్ చేసి చెక్అవుట్ వోచర్‌ను అప్లయ్ చేయాలి.

Read Also : Best Cars India : లైఫ్‌లో ఫస్ట్ టైం కారు కొంటున్నారా? సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ అందించే బెస్ట్ కార్లు ఇవే.. మీ బడ్జెట్ ధరలోనే..!

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7 లాంచ్ తేదీ :
జూలై 9న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ నిర్వహించనున్నట్టు శాంసంగ్ ధృవీకరించింది. కంపెనీ గెలాక్సీ Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7, Z ఫ్లిప్ 7 FE మోడళ్లను ప్రవేశపెట్టవచ్చు. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 విషయానికి వస్తే.. అత్యంత సన్నని తేలికైన ఫోల్డబుల్‌గా చెప్పవచ్చు. ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉండవచ్చు.

4,272mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ యూఐ 8తో వస్తుందని అంచనా. కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 200MP ప్రైమరీ కెమెరాతో పాటు 10MP టెలిఫొటో, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను పొందవచ్చు. మరోవైపు, గెలాక్సీ Z ఫ్లిప్ 7, Z ఫ్లిప్ 6 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఎక్సినోస్ 2500 చిప్‌సెట్‌తో రానుంది. ఈ శాంసంగ్ ఫోన్ 4,174mAh బ్యాటరీతో రావచ్చు.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, Z Flip 7 ధర (అంచనా) :
భారతీయ మార్కెట్లో గెలాక్సీ Z ఫోల్డ్ 7 ధర దాదాపు రూ.1,64,999 ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE ధర రూ.1,09,999 ఉంటుంది. కంపెనీ ఇంకా కచ్చితమైన ధరను రివీల్ చేయలేదు.