Samsung Galaxy Z Fold 7 Price : దిమ్మతిరిగే ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌పై రూ. 23వేలు డిస్కౌంట్.. ఇంత చీప్‌గా మళ్లీ దొరకదు!

Samsung Galaxy Z Fold 7 Price : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ప్రారంభ ధర కన్నా రూ. 23వేల వరకు తక్కువకే లభిస్తోంది.

Samsung Galaxy Z Fold 7 Price

  • శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కొంటున్నారా?
  • శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7పై బిగ్ డిస్కౌంట్
  • రూ. 7వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, జూలై 31 వరకు మాత్రమే

Samsung Galaxy Z Fold 7 Price : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ఏడాదిలో 3 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ లాంచ్ చేసింది. అందులో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రాకముందే 2025లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 భారీ తగ్గింపుతో లభిస్తోంది. శాంసంగ్ ఇండియా (Samsung Galaxy Z Fold 7 Price) అధికారిక స్టోర్‌లో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7పై ఆఫర్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 12GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 512GB, 16GB ర్యామ్ + 1TBతో వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 1,74,999 కాగా, 512GB మోడల్ ధర రూ. 1,86,999కి లభిస్తుంది. శాంసంగ్ అధికారిక స్టోరు ద్వారా కొంటే రూ. 7,000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 3వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ డిస్కౌంట్ల తర్వాత మీకు రూ. 7వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అదనంగా, రెఫరల్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్ ద్వారా రూ. 6వేలు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌పై మొత్తం రూ. 23వేలు సేవ్ చేయొచ్చు. ఈ డిస్కౌంట్లతో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ రూ. 1,51,999 ప్రారంభ ధరకే లభిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు మాత్రమే లభిస్తుంది.

Read Also : Apple iPhone 16 Plus : ఆఫర్ అదిరింది భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?

ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
గత ఏడాదిలో లాంచ్ అయిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లో 8-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ 2600 నిట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.5-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్, 1TB స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్‌యూఐ 8పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 4,400mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం రెండు 10MP కెమెరాలు కూడా ఉన్నాయి.