Apple iPhone 16 Plus : ఆఫర్ అదిరింది భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?
Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 12వేలు తగ్గింపు పొందవచ్చు..
Apple iPhone 16 Plus
- ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది
- బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా పొందొచ్చు
- భారీ డిస్ప్లే, ఫాస్ట్ పర్ఫార్మెన్స్, అదిరే కెమెరాలు
Apple iPhone 16 Plus : ఐఫోన్ లవర్స్ కోసం అదిరిపోయే ఆఫర్.. మీకోసం మంచి డీల్ రెడీగా ఉంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తుంటే ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫ్లాగ్షిప్ ఫోన్‌పై రూ. 12వేలకుపైగా భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఈ డివైస్‌లో A18 చిప్ 6.7-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఉన్నాయి. అంతేకాదు.. ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది. మీరు ఈ ఐఫోన్ కొనేందుకు సొంతం ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు కూడా ఉండవు. ఫ్లిప్‌కార్ట్‌లోని ఐఫోన్ 16 ప్లస్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గింపు :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం కేవలం రూ. 77,900కే అమ్ముడవుతోంది. అధికారిక ప్రారంభ ధరపై రూ. 12వేలు ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 3,895 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 74,005కు తగ్గుతుంది.
12 నెలల్లో నెలకు కేవలం రూ. 6,492 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అదనపు డిస్కౌంట్ కోసం మీ పాత డివైజ్‌తో ట్రేడ్-ఇన్ చేయవచ్చు. మీ డివైజ్ బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 60,750 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తుంది.
ఐఫోన్ 16 ప్లస్ కొనాలా? వద్దా? :
ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 6.7-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. మూవీలు, గేమ్స్ ఆడేందుకు చాలా బెటర్. ఆకట్టుకునే స్క్రీన్ సైజుతో పాటు ఈ ఫోన్లో A18 ప్రాసెసర్ కూడా ఉంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్లస్‌లో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఐఫోన్ 16 ప్లస్‌లో 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. IP68 లెవల్ ప్రొటెక్షన్ అల్యూమినియం ఫ్రేమ్ ఉన్నాయి.
అయితే, మీరు ఒకవేళ ప్రో-లెవల్ కెమెరా కోసం చూస్తుంటే ఐఫోన్ 16 ప్రో తీసుకోవచ్చు. లేదంటే ఐఫోన్ 16 ప్లస్ బాగా సరిపోతుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్, మన్నిక ఫీచర్లతో సరసమైన ధరకే లభిస్తుంది.
