Samsung Galaxy Z Trifold
Samsung Galaxy Z Trifold : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యూఏఈలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ట్రిపుల్-ఫోల్డింగ్ డిజైన్‌ను కలిగి ఉంది. రెండు లోపలికి-ఫోల్డింగ్ హింజ్‌లు ఒకే భారీ డిస్‌ప్లేలోకి ఓపెన్ అవుతాయి.
3nm ప్రాసెస్‌పై రూపొందిన గెలాక్సీ చిప్‌సెట్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది. 16GB వరకు ర్యామ్, 200MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అదే సమయంలో, ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ 512GB మోడల్ ధర AED 9,999 నుంచి ప్రారంభమవుతుంది.
ధర, లభ్యత :
శాంసంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ ఫోన్ డిసెంబర్ 19, 2025న యూఏఈలో లాంచ్ అయింది. ఈ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ AED 9,999 నుంచి ప్రారంభమవుతుంది. భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2,26,700కు పొందవచ్చు. 16GB ర్యామ్ ప్లస్ 1TB స్టోరేజ్ వేరియంట్ AED 13,499, భారతీయ కరెన్సీలో సుమారు రూ. 3,05,000 ఉంటుంది.
Samsung Galaxy Z Trifold
కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
శాంసంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ ఫోన్ బ్యాక్ సైడ్ OISతో 200MP మెయిన్ వైడ్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ 3× ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్‌ను పొందుతారు. ఫ్రంట్ సైడ్ డ్యూయల్ 10MP సెల్ఫీ కెమెరాలను పొందుతారు.
కవర్ స్క్రీన్‌పై మరొకటి మెయిన్ స్క్రీన్‌పై ఉంటుంది. ఈ ఫోన్ భారీ 5600mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. దాదాపు 30 నిమిషాల్లో 50శాతానికి చేరుకుంటుంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్ 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
డిస్‌ప్లే, డిజైన్ :
10.0-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X QXGA+ మెయిన్ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 1600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X కవర్ డిస్‌ప్లే కూడా కలిగి ఉంది. 2600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు చేరుకుంటుంది. భారీ లోపలి స్క్రీన్ యూజర్లు పక్కపక్కనే 3 యాప్‌లను రన్ చేసేందుకు వీలుంటుంది.
డిజైన్, బిల్డ్ :
ట్రిపుల్-ఫోల్డింగ్ డిజైన్ కలిగి ఉంది. రెండు లోపలికి-ఫోల్డింగ్ హింజ్‌లు సింగిల్ భారీ డిస్‌ప్లేలో ఉంటాయి. దుమ్ము, నీటి నిరోధకతకు IP48 రేటింగ్ కలిగి ఉంది. డ్యూయల్ టైటానియం హింజ్ ఉపయోగిస్తుంది. ఈ ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు సన్నని పాయింట్ వద్ద 3.9 మిమీ మందం కలిగి ఉంటుంది. సింగిల్ క్రాఫ్టెడ్ బ్లాక్ కలర్‌వేలో లభిస్తుంది.
Samsung Galaxy Z Trifold
డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ ఫోన్ గెలాక్సీ చిప్‌సెట్ కస్టమైజడ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది. 512GB లేదా 1TB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌తో హై-ఎండ్ 16GB ర్యామ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. గేమింగ్ మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఈ ఫోన్ శాంసంగ్ వన్ యూఐ 8 ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 16లో రన్ అవుతుంది. ఫుల్ డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్స్ కోసం శాంసంగ్ డెక్స్‌కి కూడా సపోర్టు ఇస్తుంది. జనరేటివ్ ఎడిట్ జెమిని లైవ్ వంటి కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్‌లను ఇంటిగ్రేట్ చేస్తుంది.