Apple iPhone 16 : మీ ఫోన్లు మడతపెట్టినప్పుడు చెప్పండి.. ఆపిల్ ఐఫోన్ 16పై శాంసంగ్ వ్యంగ్యాస్త్రాలు..!

Samsung Jab Apple iPhone 16 : శాంసంగ్ అధికారిక (X) అకౌంట్లో " మీ ఐఫోన్ 16 సిరీస్ మడతబెట్టినప్పుడు మాకు తెలియజేయండి" అంటూ పాత పోస్టును రీట్వీట్ చేసింది.

Samsung Takes Jab At Apple's iPhone 16

Samsung Jab on Apple iPhone 16 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో నిర్వహించిన గ్లోటైమ్ ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో మొత్తం 4 మోడల్స్ తీసుకొచ్చింది. అందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16 మ్యాక్స్ వంటి ఫోన్ మోడల్స్ ఉన్నాయి.

Read Also : Huawei Mate XT : ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్.. హువావే మేట్ XT మడతబెట్టే ఫోన్.. ధర ఎంతో తెలుసా?

ఐఫోన్ 16 సిరీస్ మాత్రమే కాదు.. ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్ పాడ్స్ 4 వంటి డివైజ్‌లను ఆవిష్కరించింది. ప్రపంచమంతా ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ గురించి ఆసక్తిగా చూస్తుంటే.. చిరకాల ప్రత్యర్థి సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ మాత్రం ఆపిల్‌ ప్రవేశపెట్టిన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రత్యేకించి ఐఫోన్ 16పై సెటైరిక్ ట్వీట్లతో రచ్చ చేసింది.

మీ ఫోన్లు మడతబెడితే మాకు చెప్పండి :
శాంసంగ్ అధికారిక (X) అకౌంట్లో “అది మడతబెట్టినప్పుడు మాకు తెలియజేయండి” అంటూ పాత పోస్టును రీట్వీట్ చేసింది. వాస్తవానికి ఈ పోస్టు 2022 అప్‌లోడ్‌ చేయగా ఆపిల్‌పై సరదాగా శాంసంగ్ రీపోస్ట్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై సెటైరిక్ కామెంట్లను పేల్చింది.

గ్లోబల్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే శాంసంగ్ సహా పలు ఆండ్రాయిడ్ బ్రాండ్లు ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లోకి దించేశాయి. ఇతర బ్రాండ్లు కూడా ఫోల్డబుల్ ఫోన్లను ప్రవేశపెట్టడంపైనే దృష్టిపెట్టాయి. కానీ, టెక్ దిగ్గజం ఆపిల్ మాత్రం ఫోల్డబుల్ ఫోన్లపై ఫోకస్ పెట్టడం లేదు.

ఇప్పటికీ ఆపిల్ మడతబెట్టే ఫోన్లను రిలీజ్ చేయకపోవడంపై శాంసంగ్ తనదైన శైలిలో సెటైర్లు విసిరింది. శాంసంగ్ నుంచి అనేక ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి. కొత్తగా శాంసంగ్ ‘‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5’’ మడతబెట్టే ఫోన్ కూడా రాబోతుంది. ‘‘స్టిల్ వెయిటింగ్..’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.

ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లపై శాంసంగ్ :
అంతేకాదు.. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌ల వద్ద ఆగలేదు. మరో ట్వీట్‌లో.. కొరియన్ టెక్ దిగ్గజం.. “మీకు తెలుసా… మేము మీ ఏఐ అంచనాలను చాలా ఎక్కువగా సెట్ చేసి ఉండవచ్చు.” ఈ ట్వీట్ ఆపిల్ కొత్త ‘ఆపిల్ ఇంటెలిజెన్స్’, ఐఫోన్ 16 సిరీస్‌తో ప్రవేశపెట్టిన ఏఐ ఫీచర్‌ ఉద్దేశించినట్టుగా కనిపిస్తుంది.

శాంసంగ్ ట్వీట్లపై నెటిజన్ల కామెంట్స్ :
ఆపిల్ ఐఫోన్లపై శాంసంగ్ చేసిన వరుస ట్వీట్లపై నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తున్నారు. ఆపిల్ “సంవత్సరాల క్రితమే ఫోల్డబుల్ ఆవిష్కరణలను నిలిపివేసింది” అని కొందరు కామెంట్ చేశారు. “ఇది ఒకసారి మాత్రమే మడవగలదు.. ఆ తర్వాత పనిచేస్తుందా?” మరో యూజర్ వ్యాఖ్యానించాడు.

ఆపిల్‌పై శాంసంగ్‌పై వ్యంగ్యాస్త్రాలు విసరడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు, టెక్ దిగ్గజం ఆపిల్ ఐప్యాడ్ ప్రో ప్రకటనపై కూడా సెటైర్లు వేసింది. గతంలో శాంసంగ్ ‘క్రియేటివిటీ కానాట్ బి క్రష్డ్’ పేరుతో 43-సెకన్ల స్పాట్‌ను రిలీజ్ చేసింది.

యాడ్ ఆపిల్ హైడ్రాలిక్ ప్రెస్ వదిలివేసిన శిథిలాల గుండా నడుస్తూ.. విరిగిన గిటార్‌తో గెలాక్సీ ట్యాబ్ S9 అల్ట్రాలో మ్యూజిక్ నోట్స్ చదువుతున్నప్పుడు దానిని ప్లే చేస్తూ యాడ్ కనిపించింది. శాంసంగ్ మెసేజ్‌లో “మేం క్రియేటివిటీని ఎప్పటికీ అణిచివేయం” అని పేర్కొంది.

Read Also : iPhone 16 Launch : A18 చిప్‌సెట్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ ఐఫోన్ 16.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు