iPhone 16 Launch : A18 చిప్‌సెట్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ ఐఫోన్ 16.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

iPhone 16 Launch : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 16ప్రో ధరలు వరుసగా రూ. 1,19,900, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ రూ. 1,44,900 వద్ద కొనుగోలు చేయొచ్చు.

iPhone 16 Launch : A18 చిప్‌సెట్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ ఐఫోన్ 16.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Apple launches most powerful iPhone yet with A18 chipset

iPhone 16 Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 16 మోడల్‌లతో పాటు కొత్త వాచ్ సిరీస్, ఎయిర్‌పాడ్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఆపిల్ ఐఫోన్ 16 అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఐఫోన్ సిరీస్ స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు ఇప్పటికే రివీల్ చేసింది.

Read Also : Apple iOS 18 Update : ఐఓఎస్ 18 అప్‌డేట్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్టు మీకోసం..

ఐఫోన్ 16 సిరీస్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ కస్టమైజడ్ బటన్ ఫీచర్.. వినియోగదారులు వాయిస్ మెమోలను రికార్డ్ చేయడం లేదా (FordPass) యాప్ ద్వారా వారి కారును అన్‌లాక్ చేయడం వంటి టాస్కులను అనుమతిస్తుంది. ఈ ఐఫోన్ 16 సిరీస్ స్టోరేజీ కెపాసిటీ పరంగా 128జీబీ, 256జీబీ, 512జీబీ వేర్వేరు స్టోరేజీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 16 సిరీస్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
డి‌స్‌ప్లే పరంగా చూస్తే.. ఐఫోన్ 16లో 6.1 అంగుళాలు, ఐఫోన్ 16 ప్లస్‌లో 6.7, ఐఫోన్ 16లో 460పీపీఐ వద్ద 2556×1179-పిక్సెల్ రిజల్యూషన్‌తో సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. అయితే, ఐఫోన్ 16 ప్లస్ 2796×1290-పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

లేటెస్ట్ A18 చిప్‌సెట్ ఇంటిగ్రేషన్ :
క్యూఎల్ఈడీ రెండూ ఐఈసీ 60529 కింద ఐపీ68 (గరిష్టంగా 6 మీటర్ల లోతు 30 నిమిషాల వరకు) రేటింగ్ అందిస్తుంది. ఐఫోన్ 16తో ఇంటిగ్రేట్ అయిన ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో వస్తాయి. పర్ఫార్మెన్స్ 2 కోర్లు, 4 ఎఫిషియన్సెనీ కోర్లతో కొత్త 6-కోర్ సీపీయూతో లేటెస్ట్ ఎ18 చిప్ ఉంది. కొత్త 5-కోర్ జీపీయూ, కొత్త 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కలిగి ఉంది.

ఐఫోన్ 16 కెమెరా సిస్టమ్ 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో అద్భుతమైన అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. తక్కువ-కాంతిలో కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ ఫోన్‌లో కొత్త 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, అడ్వాన్స్‌డ్ మాక్రో ఫోటోగ్రఫీ ఫీచర్‌లు ఉన్నాయి. 4కె60 వీడియో, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ సపోర్టుతో ఐఫోన్ 16 ఆపిల్ విజన్ ప్రోకి సపోర్టుగా స్పేషియల్ వీడియో, ఫొటోలను కూడా ప్రవేశపెట్టింది.

కనెక్టివిటీ ఫీచర్లలో జీపీఎస్, జీఎల్ఓఎన్ఏఎస్ఎస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, (BeiDou), డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులార్ (iBeacon) మైక్రో-లొకేషన్ ఐఫోన్ 16 గేమింగ్‌ ఫీచర్లను అందిస్తుంది. రే ట్రేసింగ్, రెసిడెంట్ ఈవిల్ 7 బయోహాజార్డ్ వంటి ఎఎఎ అనే టైటిల్‌లకు సపోర్టు కూడా ఉంది. కొత్త థర్మల్ ఆప్టిమైజేషన్‌లు 30 శాతం హై స్టేబిలిటీ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. గేమర్‌లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలివే :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 16ప్రో ధరలు వరుసగా రూ. 1,19,900, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ రూ. 1,44,900 వద్ద అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ధరలు రూ. 89,999కు పొందవచ్చు. ఈ ఐఫోన్ మోడల్స్ ప్రీ-ఆర్డర్ సేల్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.

Read Also : ఆపిల్ ఐఫోన్ 16ప్రో సిరీస్ చూశారా? స్ర్కీన్ పెద్దది.. ధర తక్కువ.. భారత్‌లో ఎంతంటే?