New Credit Card : SBI, PhonePe కొత్త క్రెడిట్ కార్డు వచ్చేసింది.. వోచర్లు, రివార్డుల బెనిఫిట్స్ ఇవే.. ఎలా అప్లయ్ చేయాలంటే?

SBI PhonePe Credit Card : క్రెడిట్ కార్డు కావాలా? డిజిటల్ క్రెడిట్ కార్డులు వచ్చేశాయి. SBI కార్డ్, ఫోన్‌పే కొత్త క్రెడిట్ కార్డు వచ్చేసింది..

New Credit Card

SBI PhonePe Credit Card : కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఎస్బీఐ, ఫోన్‌పే సంయుక్తంగా కొత్త క్రెడిట్ కార్డు లాంచ్ చేశాయి. ప్రస్తుత రోజుల్లో (SBI PhonePe Credit Card) క్రెడిట్ కార్డ్ అనేది జీవితంలో భాగమై పోయింది. చాలామంది షాపింగ్, టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్‌ల కోసం ఈ క్రెడిట్ కార్డులనే వాడుతున్నారు.

దేశంలో క్రెడిట్ కార్డులపై ఆధారపడటం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు క్రెడిట్ కార్డులు డిజిటల్ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకించి రోజువారీ ఖర్చులపై కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ అందించేలా SBI కార్డ్, ఫోన్‌పే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి.

రెండు వేరియంట్లలో క్రెడిట్ కార్డు :
ఫోన్‌పే, ఎస్బీఐ కార్డ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి సెలెక్ట్ బ్లాక్, మరొకటి పర్పుల్ క్రెడిట్ కార్డు. మీరు ఈ క్రెడిట్ కార్డులతో ఫోన్‌పే యాప్ ద్వారా షాపింగ్, బిల్లు పేమెంట్స్, ట్రావెల్ బుకింగ్, బీమా ప్రీమియం లేదా కిరాణా వంటి వాటిపై ఖర్చు చేస్తే రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.

సెలక్ట్ బ్లాక్ కార్డును తీసుకుంటే.. పర్పల్ కార్డుపై రూ. 1,500 విలువైన ఫోన్‌పే ఇ-వోచర్, రూ. 500 విలువైన వోచర్‌ను పొందవచ్చు. సెలెక్ట్ బ్లాక్ కార్డును ఉపయోగించి ఫోన్‌పే యాప్‌లో ఖర్చు చేయడంపై కస్టమర్‌లు రివార్డ్ పాయింట్ల రూపంలో 10 శాతం వరకు పొందవచ్చు. మరోవైపు, ఇతర ఆన్‌లైన్ షాపింగ్‌లపై 5 శాతం వరకు రివార్డ్ పాయింట్లు పొందవచ్చు.

Read Also : Nothing Phone 3 : అదిరిపోయే ఆఫర్.. కొత్త నథింగ్ ఫోన్ 3 ధర తగ్గిందోచ్.. రూ. 20వేలు డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే..!

RuPay, VISA నెట్‌వర్క్‌లకు వర్తింపు :
నివేదికల ప్రకారం.. ఈ కొత్త క్రెడిట్ కార్డులు RuPay, VISA నెట్‌వర్క్‌లలో పనిచేస్తాయి. RuPay కార్డులను UPIకి లింక్ చేయవచ్చు. తద్వారా వినియోగదారులు లక్షలాది UPI మర్చంట్స్ వద్ద నేరుగా పేమెంట్లు చేయవచ్చు. సేఫ్ ఆన్‌లైన్ వినియోగానికి VISA కార్డులను టోకెనైజ్ చేయవచ్చు.

క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ఏంటి? :
ఈ క్రెడిట్ కార్డుతో కిరాణా వస్తువులు, బిల్లులు, ట్రావెల్ బుకింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇతర గిఫ్ట్స్ కూడా పొందవచ్చు. మీరు (SELECT BLACK) కార్డుతో ఏడాదికి రూ. 5 లక్షలు ఖర్చు చేస్తే చాలు.. మీకు రూ. 5,000 ట్రావెల్ వోచర్ లభిస్తుంది.

మరోవైపు, (PURPLE) కార్డుపై సంవత్సరానికి రూ. 3 లక్షలు ఖర్చు చేస్తే.. మీకు రూ. 3,000 ట్రావెల్ వోచర్ లభిస్తుంది. ఎయిర్‌ఫోర్ట్ లాంజ్ సౌకర్యం, (SELECT BLACK) వినియోగదారులకు పాస్ మెంబర్‌షిప్, పెట్రోల్ 1 శాతం ఫ్యూయల్ సర్‌చార్జ్ తగ్గింపు వంటి అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ప్రస్తుతం, ఈ క్రెడిట్ కార్డులు ప్రతిరోజూ డిజిటల్ పేమెంట్లు చేసే వారికి బెస్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు.. రివార్డులను కూడా సంపాదించుకోవచ్చు.

ఎలా అప్లయ్ చేయాలంటే? :
ఈ క్రెడిట్ కార్డు పొందాలంటే నేరుగా PhonePe యాప్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అక్కడే బిల్లు కూడా పేమెంట్ చేయొచ్చు. ఈ భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డ్ వినియోగం, డిజిటల్ పేమెంట్లు రెండింటినీ ప్రోత్సహిస్తుందని ఎస్బీఐ కార్డ్ సీఈఓ సలీలా పాండే అన్నారు. ఈ క్రెడిట్ కార్డు అతి త్వరలోనే వినియోగదారులందరికి అందుబాటులోకి రానుంది.