Nothing Phone 3 : అదిరిపోయే ఆఫర్.. కొత్త నథింగ్ ఫోన్ 3 ధర తగ్గిందోచ్.. రూ. 20వేలు డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే..!
Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ. 20వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 3
Nothing Phone 3 : నథింగ్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ నథింగ్ ఫోన్ (Nothing Phone 3) రూ. 79,999 ధరకు లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు, నథింగ్ ఫోన్ 3పై రూ. 20వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
ఈ బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గ్లిఫ్ మ్యాట్రిక్స్‌తో ప్రవేశపెట్టింది. మైక్రో ఎల్ఈడీలు, అసింమెట్రికల్ ట్రిపుల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ వంటి మరిన్నింటిని కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3 ధర :
నథింగ్ ఫోన్ 3 మోడల్ రూ.79,999 ధరకు (Nothing Phone 3) లాంచ్ అయింది. ICICI, IDFC క్రెడిట్ కార్డులతో కస్టమర్లు రూ.10వేల బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇంకా, కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.10వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ధర దాదాపు రూ.59,999కి తగ్గుతుంది. అదనంగా, మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ వాల్యూ రూ.68వేల వరకు తగ్గుతుంది.
వినియోగదారులు నెలకు రూ.4,445 నుంచి EMI ఆప్షన్లు ఎంచుకోవచ్చు. అలాగే, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. కొనుగోలుదారులు అదనంగా చెల్లించడం ద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌లను పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 3 స్పెషిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ 6.67-అంగుళాల (Nothing Phone 3) అమోల్డ్ ప్యానెల్‌తో HDR10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను పొందుతుంది. ఈ నథింగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 కలిగి ఉంది.
16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ నథింగ్ ఫోన్ 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.