CIBIL Faster Loans : అమ్మయ్యా.. ఇక CIBIL స్కోరు చెకింగ్ ఉండదా? లోన్లు ఈజీగా వస్తాయా? కొత్త క్రెడిట్ రూల్స్ ఏంటి?
CIBIL Faster Loans : సిబిల్ క్రెడిట్ స్కోరు చెకింగ్ ప్రాసెస్ ఉండదా? కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారం ద్వారా లోన్ ప్రాసెస్ మరింత వేగవంతం కానుంది.

CIBIL Faster Loans
CIBIL Faster Loans : బ్యాంకు లోన్ల కోసం చూస్తున్నారా? ఇకపై లోన్ కోసం సిబిల్ స్కోరు చెకింగ్ ప్రాసెస్ ఉండకపోవచ్చు. ULI అనే టెక్నాలజీతో డేటా విధానాన్ని అప్‌గ్రేడ్ చేయనున్నారు. తద్వారా లోన్ల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. లోన్లను ఆమోదించే ముందు CIBIL స్కోర్‌లను చెక్ చేసే ప్రాసెస్ అతి త్వరలో మారనుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (DFS), సాంప్రదాయ క్రెడిట్ స్కోర్‌లపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. ఇందుకోసం కొత్త డిజిటల్ లెండింగ్ సిస్టమ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) డిజిటల్ ప్లాట్‌ఫారం విస్తరించేందుకు కృషి చేస్తోంది.
ప్రస్తుతం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దరఖాస్తుదారుడి క్రెడిట్ అర్హతను అంచనా కోసం ప్రధానంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (CIBIL) స్కోర్‌లపై ఆధారపడతాయి. అయితే, ULIతో లోన్ ప్రాసెస్ మరింత ఈజీ కానుంది. దీనికి సంబంధించి DFS అన్ని ఫైనాన్షియల్ సంస్థలకు నెలవారీ ప్రాతిపదికన ULI రివ్యూ చేయాలని సూచించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. జూన్ 23న DFS కార్యదర్శి M నాగరాజు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు వివిధ కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో సమావేశమై దేశవ్యాప్తంగా ULI అమలుపై సుదీర్ఘంగా చర్చించారు.
లోన్ ప్రాసెసింగ్ స్పీడ్ చేయడంతో పాటు ట్రేడేషనల్ క్రెడిట్ బ్యూరోలపై తక్కువ ఆధారపడవచ్చు. ఇది అమల్లోకి వస్తే.. ULI భారత్‌లో రుణాలు ఆమోదించే విధానంలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. అనేక మంది రుణగ్రహీతలకు ఈ కొత్త వ్యవస్థ మరింత అందుబాటులోకి వస్తుంది.
యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) ఏంటి? :
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ అనేది టెక్నాలజీ, డేటా పాలసీ ద్వారా లోన్ ప్రాసెస్ చేసే డిజిటల్ ప్లాట్‌ఫామ్. రుణదాతలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, శాఖల నుంచి హై క్వాలిటీ, వెరిఫైడ్ డేటాను యాక్సెస్ చేయొచ్చు. తద్వారా క్రెడిట్ ప్రాసెస్ అవుతుంది.
ULI ముఖ్య ఫీచర్లు :
క్రెడిట్ డెలివరీ : లోన్ ప్రాసెస్ క్రెడిట్ అప్రైజల్‌కు అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది.
సమ్మతి ఆధారిత డేటా షేరింగ్ : రుణగ్రహీతలు రుణదాతలకు తమ ఆర్థిక, ఆర్థికేతర రికార్డులను యాక్సెస్ చేసేందుకు అనుమతి ఇవ్వవచ్చు. తద్వారా లోన్ ప్రాసెసింగ్ స్పీడ్ అవుతుంది.
స్టాండర్డ్ API : ఫైనాన్షియల్ సంస్థల మధ్య సజావుగా డేటా ఎక్స్ఛేంజ్ జరుగుతుంది. టెక్నికల్ ఇంటిగ్రేషన్ అవసరం ఉండదు.
అల్ట్రానేటివ్ డేటా ఎవల్యూషన్ : క్రెడిట్ అంచనా కోసం యుటిలిటీ బిల్లు పేమెంట్లు, GST రికార్డులు వంటి సాంప్రదాయేతర డేటా వాడొచ్చు.
ULI బెనిఫిట్స్ ఇవే :
గ్రామీణ ప్రాంతాల్లో లోన్లు పొందిన వారు, చిన్న వ్యాపారాలకు అధికారిక క్రెడిట్ ఎకోసిస్టమ్
ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత ఉంటుంది. ఫ్రాడ్స్ వంటి జరిగే అవకాశం ఉండదు.
లోన్ ప్రాసెసింగ్ ఖర్చులు తగ్గుతాయి. లోన్ ప్రాసెస్ ఆటోమేట్ చేస్తుంది. డిజిటలైజ్ అవుతుంది.
పేపర్ వర్క్, నిర్వహణ ఖర్చులను తగ్గుతాయి. MSME, రైతులకు లోన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. సకాలంలో క్రెడిట్ యాక్సెస్ పొందవచ్చు.