Income Tax Bill 2025 : టాక్స్ పేయర్లకు పండగే.. వచ్చే ఏడాది ITR ఫైలింగ్‌లో కొత్త మార్పులివే.. ఇకపై సామాన్యులూ ఈజీగా అర్థం చేసుకోవచ్చు!

Income Tax Bill 2025 : టాక్స్ పేయర్లకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025.. త్వరలో ITR దాఖలు ప్రక్రియ మరింత ఈజీ కానుంది. పెనాల్టీలు తగ్గనున్నాయి.

Income Tax Bill 2025 : టాక్స్ పేయర్లకు పండగే.. వచ్చే ఏడాది ITR ఫైలింగ్‌లో కొత్త మార్పులివే.. ఇకపై సామాన్యులూ ఈజీగా అర్థం చేసుకోవచ్చు!

Income Tax Bill 2025

Updated On : July 25, 2025 / 7:53 PM IST

Income Tax Bill 2025 : పన్నుచెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఆదాయపు పన్ను బిల్లు 2025 రాబోతుంది. ఆదాయపు పన్నుకు సంబంధించి లోక్‌సభ సెలెక్ట్ కమిటీ (Income Tax Bill 2025) జూలై 21న 4,500 పేజీల నివేదికను సమర్పించింది. 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఆదాయపు పన్ను బిల్లు 2025లో కీలకమైన మార్పులను సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పార్లమెంటరీ పరిశీలనలో ఉన్నాయి. ప్రధానంగా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ప్రక్రియ సులభతరం కానుంది. రీఫండ్ హక్కుదారులు, గృహ కొనుగోలుదారులు, జీతం సంపాదించేవారికి ప్రత్యక్ష ప్రయోజనాలు దక్కనున్నాయి.

ప్రస్తుత ఆదాయపు పన్ను భాషను అర్థం చేసుకోవడం సామాన్యులకు చాలా కష్టంగా మారింది. కానీ, కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 ద్వారా ఈ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సామాన్యులు కూడా ఆదాయపు పన్ను బిల్లును సులభంగా అర్థం చేసుకోగలరు. తద్వారా ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులకు తక్కువ అవకాశం ఉంటుంది.

కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025లో సరళమైన భాషను వాడారు. దాంతో టాక్స్ పేయర్లు ఐటీ నిబంధనలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తప్పుడు వివరణల అవకాశాన్ని తగ్గించవచ్చు. కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త పన్ను వ్యవస్థను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం డిజిటల్ పన్ను విధానమే లక్ష్యంగా 285 మార్పులు చేయనుంది. ఈ మార్పులు ఆమోదం పొందితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది.

Read Also : Bank FD Vs Post Office : బ్యాంకు FDనా? పోస్టాఫీసు పథకాలా? పెట్టుబడికి ఏది బెటర్? ఎందులో ఎక్కువ డబ్బులు వస్తాయంటే?

1. ITR ఫైలింగ్ ఆలస్యమైనా వారికి రీఫండ్ పెనాల్టీ ఉండదు :
పన్ను చెల్లింపుదారులకు అత్యంత ముఖ్యమైన వాటిలో క్లాజ్ 479 ఒకటి. ప్రస్తుతం ఆలస్యంగా ITR దాఖలు చేసినందుకు రూ. వెయ్యి వరకు జరిమానా చెల్లించాలి. ఒక వ్యక్తి రీఫండ్ కోసం మాత్రమే ఐటీఆర్ దాఖలు చేస్తే.. మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోయినా ఆలస్యమైనందుకు ఎలాంటి జరిమానా పడదు. ఈ కొత్త మార్పు అమల్లోకి వస్తే.. పన్ను లేని ఆదాయం కలిగిన లక్షలాది మంది టాక్స్ పేయర్లకు భారీగా ప్రయోజనం కలుగుతుంది.

2. గృహ, అద్దె ఆదాయంపై భారీ తగ్గింపులు :
ఇంటి అద్దెల ద్వారా వచ్చే ఆదాయం కింద రెండు కీలకమైన విషయాలను ప్రతిపాదించారు. మున్సిపల్ టాక్స్ తర్వాత ప్రస్తుత 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి.

అద్దె ఆస్తులకు వడ్డీ మినహాయింపు : హోం లోన్ల వడ్డీ తగ్గింపుపై సొంత ఆస్తులకు మాత్రమే కాకుండా అద్దె ఇళ్లకు కూడా విస్తరించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ కొత్త మార్పులు మధ్యతరగతి గృహయజమానులకు, ముఖ్యంగా అద్దె ఆదాయం కోసం ఆస్తిలో పెట్టుబడి పెట్టేవారికి ప్రయోజకరంగా ఉంటుంది.

3. ఇకపై TDS/TCS రీఫండ్స్ వేగవంతం :
పన్ను చెల్లింపుదారులను నిరాశపరుస్తున్న TDS, TCS కోసం సరళీకృత రీఫండ్ ప్రక్రియ అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కొత్త బిల్లు కింద పన్ను నియమాలను అధికారిక జాప్యాలను తగ్గించేలా ఈ బిల్లును రూపొందిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా కొత్త పన్ను బిల్లు నియమాలతో రూపొందిస్తున్నామని CBDT చీఫ్ పేర్కొన్నారు.