SBI Customers : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కోట్లాది మంది కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1న (ఈరోజు) మూడు గంటల పాటు ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు పనిచేయవు. ప్రస్తుతానికి ఎస్బీఐ డిజిటల్ సర్వీసులు నిలిచిపోయాయి. ఈరోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది.
అందుకే, బ్యాంకు డిజిటల్ సర్వీసులు ఈరోజు దాదాపు 3 గంటల పాటు అందుబాటులో ఉండవు.. వార్షిక ముగింపు కార్యకలాపాల కారణంగా, ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంక్ అన్ని డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవని SBI ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also : POCO C71 : వావ్.. పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త పోకో ఫోన్.. ఏప్రిల్ 4నే లాంచ్.. ధర మీ బడ్జెట్‌లోనే..!
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొబైల్ డిజిటల్ సర్వీసులు నిలిచిపోవడంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది ఎస్బీఐ వినియోగదారులు ఈ సాంకేతిక సమస్యను నివేదిస్తున్నారు. ముఖ్యంగా ఎస్బీఐలో మొబైల్ బ్యాంకింగ్, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో ఫెయిల్ అవుతున్నాయని అనేక మంది ఎస్బీఐ కస్టమర్లు నివేదించారు.
— State Bank of India (@TheOfficialSBI) April 1, 2025
ఎప్పటివరకు పనిచేయవంటే? :
వార్షిక ముగింపు కార్యకలాపాల కారణంగా.. ఈ రోజు (ఏప్రిల్ 1, 2025) మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంక్ అన్ని డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉండవని ఎస్బీఐ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అయితే, కస్టమర్లు UPI లైట్ లేదా ATM ఛానల్స్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్, మనీ డిపాజిట్, ఫండ్‌ట్రాన్స్ ఫర్ వంటి సర్వీసులు పనిచేయవు.