Old Car Renewal : మీకు 15ఏళ్లు దాటిన పాత కారు ఉందా? 8 రెట్లు ఫీజు చెల్లించాల్సిందే!

కాలం చెల్లిన పాత కార్లు పక్కన పెట్టాల్సిందే.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ దగ్గర పాత కారు ఉందా? 15ఏళ్లు దాటిందా? అయితే ఎనిమిది రెట్లు ఫీజు చెల్లించాల్సిందే..

higher fee for registration renewal : కాలం చెల్లిన పాత కార్లు పక్కన పెట్టాల్సిందే.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ దగ్గర పాత కారు ఉందా? 15ఏళ్లు దాటిందా? అయితే ఎనిమిది రెట్లు ఫీజు చెల్లించాల్సిందే.. పాత కార్ల రెన్యువల్ సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. పాత వాహనాలను పక్కనపెట్టి కొత్త వాహనాల కొనుగోళ్లకు కేంద్రం ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే 15ఏళ్లు దాటిన పాతకార్లపై భారీ ఫీజులను వసూల్ చేయనుంది. 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు అమల్లోకి రానున్నాయి.

అలాగే కమర్షియల్ వెహికల్స్ ఓనర్లు ట్రక్స్, బస్సుల ఫిట్ నెస్ సర్టిఫికేట్స్ రెన్యువల్ సమయంలోనూ దాదాపు 8 రెట్లు వరకు అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పొరుగు ప్రాంతాల్లో మాత్రం 10 ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాలు, 15ఏళ్లు దాటిన పెట్రోల్ వాహ‌నాల య‌జ‌మానుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు. ఎందుకంటే ఇప్ప‌టికే ఢిల్లీలో ఆయా వాహనాలపై నిషేధం విధించారు.
WhatsApp Down : పని చేయని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. కారణం అదేనా? చైనా పనేనా?

నోటిఫికేషన్ ప్రకారం.. రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇలా ఉండనున్నాయి. ప్ర‌స్తుతం 15ఏళ్లు దాటిన‌ రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ ఫీజు రూ.600గా ఉంది. పెంచబోయే ఛార్జీలతో రూ.5వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఓల్డ్ బైక్‌ల రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ చార్జీలు రూ.300 నుంచి రూ.1,000 వరకు పెరగనున్నాయి. 15 ఏళ్లు దాటిన బ‌స్, ట్ర‌క్ ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ పొందాలంటే ఇప్పుడు రూ.1500 చెల్లించాలి. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మాత్రం రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ పొందే అవకాశం ఉంటుంది.

రిజిస్ట్రేష‌న్ చేయించుకోవడం ఆలస్యమైతే మాత్రం రోజువారీ నుంచి నెలవారీగా జరిమానాలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ చేయించుకోవడం ఆలస్యమైతే ఆ వాహనాల యజమానులు నెల‌కు రూ.300 వరకు ఫీజు చెల్లించాలి. అదే క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్‌కు మాత్రం రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్‌లో ఆలస్యమైతే.. రోజుకు రూ.50 జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాత వాహ‌నాల‌కు ప్ర‌తి ఐదేళ్లకు ఒకసారి రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ చేయించుకోవడం తప్పనిసరి.

ఎనిమిదేళ్లు దాటిన వాణిజ్య వాహ‌నాల‌కు ప్రతి ఏటా ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఎనిమిది ఏళ్లు దాటిన‌ క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల‌కు ప్రతి ఏడాదిలో ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహ‌నాల‌కు మాన్యువ‌ల్ అండ్ ఆటోమేటెడ్ ఫిట్ టెస్ట్‌ చేయించుకోవాలన్నా ఫీజు చెల్లించాల్సిందే.
WhatsApp Down : పని చేయని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. కారణం అదేనా? చైనా పనేనా?

ట్రెండింగ్ వార్తలు