భారత్ లో 15 శాతం తగ్గనున్న స్మార్ట్‌ఫోన్ రవాణా

కరోనావైరస్ ప్రభావం గత సంవత్సరంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో కనిపించడం ప్రారంభమైంది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో..

Smartphone Shipments

Smartphone shipments : కరోనావైరస్ ప్రభావం గత సంవత్సరంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో కనిపించడం ప్రారంభమైంది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 10 నుండి 15% తగ్గుతాయని కౌంటర్‌ పాయింట్ రీసెర్చ్ మార్కెట్ ట్రాకర్ అంచనా వేసింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైతో పాటు ఇతర ప్రధాన నగరాలకు రవాణా తగ్గింది. ఈ నగరాలు మొత్తం సరుకుల్లో నాలుగింట ఒక వంతు ఉన్నాయి. ఈ సమయంలో 5 మిలియన్ (సుమారు 50 లక్షలు) స్మార్ట్‌ఫోన్‌ల రవాణా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ ట్రాకర్ భావిస్తోంది.

పాక్షిక లాక్‌డౌన్ కు అవకాశం ఉన్నందున చాలా రాష్ట్రాల్లో స్మార్ట్‌ఫోన్‌ల డిమాండ్ తగ్గిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాథక్ తెలిపారు. కౌంటర్ పాయింట్ డేటా ప్రకారం భారత్ లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2020 ఏప్రిల్ నుండి జూన్ వరకు 51% తగ్గాయని.. అయితే మే, జూన్ నెలలలో డిమాండ్ పెరుగుదల వేగవంతమైందని.. ఇప్పుడు మరోసారి గతేడాది పరిస్థితి రాబోతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 2021 రెండవ త్రైమాసికంలో 50 మిలియన్ల ఫోన్ ల రవాణాను తగ్గుతుందని తరుణ్ పాథక్ అంచనా వేశారు.

ఇందులో 8 నుండి 10% ప్రధాన నగరాల్లో లాక్డౌన్ కారణంగా తగ్గే అవకాశం ఉందని అన్నారు.. కరోనా లాక్ డౌన్ కారణంగా నోయిడాలో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి ఆగిపోతే పరిశ్రమలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.. కాగా నోయిడాలో శామ్‌సంగ్, షియోమి, వివో, ఒప్పో వంటి సంస్థల ఉత్పత్తి కర్మాగారాలు ఉన్నాయి.