Upcoming Smartphones
Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వచ్చే ఆగస్టు 2025లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ కంపెనీలైన (Upcoming Smartphones) గూగుల్, ఒప్పో, శాంసంగ్, వివో, రెడ్‌మి నుంచి అనేక కొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ బ్రాండ్‌లు ప్రీమియం ఫోల్డబుల్స్ నుంచి బడ్జెట్ 5G హ్యాండ్‌సెట్‌ల వరకు స్మార్ట్‌ఫోన్ మోడళ్లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. రాబోయే నెలల్లో రాబోతున్న టాప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి..
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ :
ఆగస్టు 20న గూగుల్ పిక్సెల్ 10 లైనప్ లాంచ్ కానుంది. గూగుల్ పిక్సెల్ 10, 10 ప్రో, 10 ప్రో XL, ఫోల్డబుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఉంటాయి. ఈ స్టాండర్డ్ మోడల్స్ 6.3-అంగుళాల డిస్‌ప్లేలతో రావచ్చు. పిక్సెల్ ప్రో XL ఫోన్ 6.8-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చు.
పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ 6.4-అంగుళాల కవర్ స్క్రీన్, 8-అంగుళాల మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. బ్యాటరీ సామర్థ్యాలు 4,700mAh నుంచి 5,015mAh వరకు ఉంటాయి. పిక్సెల్ 10 సిరీస్ ధర రేంజ్ రూ. 79,999, రూ. 1,79,999 మధ్య ఉంటుందని అంచనా.
ఒప్పో K13 టర్బో సిరీస్ :
ఆగస్టు 15 నుంచి ఆగస్టు 20 మధ్య ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రో 120Hz రిఫ్రెష్ రేట్లు, 1.5K రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేలతో వచ్చే అవకాశం ఉంది. బేస్ మోడల్ డైమెన్సిటీ 8450 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. అయితే, ఒప్పో ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఒప్పో ఫోన్ ధరలు దాదాపు రూ.25వేల నుంచి ఉండవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A17 5G :
భారత మార్కెట్లో సపోర్ట్ పేజీ అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ A17 5G త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, OISతో కూడిన 50MP కెమెరాతో రావచ్చు. ఆండ్రాయిడ్ 15తో రన్ కావచ్చు.
రెడ్‌మి 15C ఫోన్.. :
అతి త్వరలో రెడ్‌మి 15C ఫోన్ (Upcoming Smartphones) లాంచ్ కానుంది. 6.9-అంగుళాల 120Hz LCD స్క్రీన్, హెలియో G81 చిప్‌సెట్, 50MP మెయిన్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉండొచ్చు. ఆగస్టులో లాంచ్ అయితే ధర రూ. 15వేల కన్నా తక్కువగా ఉండవచ్చు.
వివో V60, వివో Y400 5G :
వివో నుంచి రెండు ఫోన్లు రాబోతున్నాయి. 6.67-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ 1.5K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 6,500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది.
ఆగస్టు 12న వివో V60ని లాంచ్ కానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ వివో ఫోన్ ధర రూ.40వేల కన్నా తక్కువగా ఉండొచ్చు. ఆగస్టు 4న లాంచ్ కానున్న వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-HD+ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC, 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ వివో 5G ఫోన్ రూ. 24,999 (128GB స్టోరేజ్), రూ. 26,999 (256GB స్టోరేజ్) రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉండవచ్చు.