Starlink India Plans : స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అతి త్వరలో ఇండియాకు.. డేటా ప్లాన్లు, ధర, స్పీడ్, లాంచ్ డేట్ వివరాలివే..!

Starlink India Plans : స్టార్‌లింక్ భారత మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్‌ ప్రవేశపెట్టబోతుంది. ధర, స్పీడ్, లాంచ్ తేదీ వివరాలివే..

Starlink India Plans : స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అతి త్వరలో ఇండియాకు.. డేటా ప్లాన్లు, ధర, స్పీడ్, లాంచ్ డేట్ వివరాలివే..!

Starlink India Plans

Updated On : July 10, 2025 / 9:20 PM IST

Starlink India Plans : స్టార్‌లింక్ అతి త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. టెస్లా బాస్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అతి త్వరలో భారత్‌లో (Starlink India Plans) అందుబాటులోకి రానుంది. ఈ స్టార్ లింక్ శాటిలైట్ నెట్‌వర్క్ దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది.

వాస్తవానికి, ముందుగానే దేశంలో అందుబాటులో రావాల్సి ఉండగా, కంపెనీకి భారత ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు. ఈ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ఒకసారి అందుబాటులోకి వచ్చాక దేశంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ డెలివరీలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రారంభ సెటప్ ఖర్చు రూ. 33వేల నుంచి రూ. 35వేల మధ్య ఉంటుందని అంచనా. అయితే, స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌కు సంబంధించిన ధర, లాంచ్ తేదీ వంటి ఇతర వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : UPI Rules : యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త UPI రూల్స్.. బ్యాలెన్స్ చెక్, ఆటోపే, పేమెంట్లపై లిమిట్స్..!

స్టార్‌లింక్ ఇండియా ధరలివే :
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఒకేసారి సెటప్ చేయొచ్చు. భారతీయ మార్కెట్లో దాదాపు రూ.33వేల నుంచి రూ.35వేల వరకు ఖర్చవుతుంది. అయితే, డేటా బెనిఫిట్స్, ప్లాన్‌లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ నెలకు రూ.3వేలకు అందుబాటులో ఉండవచ్చు. ఈ ధరలపై అధికారిక ప్రకటన లేదు. లాంచ్ సమయంలో స్టార్ లింక్ అసలు ధరల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

స్టార్‌లింక్ ఇండియా లాంచ్ తేదీ ఎప్పుడంటే? :
భారత మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి స్టార్‌లింక్ ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. రాబోయే 3 నెలల్లో అందుబాటులోకి రావొచ్చు. ఇందుకోసం.. ముందస్తు ఆర్డర్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. భారతీయ వినియోగదారులు ప్రాథమిక మొత్తాన్ని చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

స్టార్‌లింక్ ఇండియా స్పీడ్ ఎంత ఉండొచ్చంటే? :
స్టార్‌లింక్ ద్వారా అందించే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను 25Mbps నుంచి ప్రారంభమై 200Mbps వరకు మల్టీ స్పీడ్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. ఈ సర్వీసు ద్వారా 100Mbps స్టేబుల్ స్పీడ్ అందిస్తుందని సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలలో నివసించే స్టేబుల్ ఇంటర్నెట్ లేని యూజర్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.