Samsung TV: శాంసంగ్ టీవీ దొంగిలించారా.. ఇలా బ్లాక్ చేసేయండి

శాంసంగ్ టీవీ సెట్స్ దొంగిలించి అమ్ముకోవడానికి ప్రయత్నించారు. దక్షిణాఫ్రికాలో కాటో రిడ్జ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఈ ఘటన జరగడంతో..

Samsung TV: శాంసంగ్ టీవీ దొంగిలించారా.. ఇలా బ్లాక్ చేసేయండి

Samsung Tv

Updated On : August 27, 2021 / 12:51 PM IST

Samsung TV: శాంసంగ్ టీవీ సెట్స్ దొంగిలించి అమ్ముకోవడానికి ప్రయత్నించారు. దక్షిణాఫ్రికాలో కాటో రిడ్జ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఈ ఘటన జరగడంతో.. అధికారులు అప్రమత్తమై వాటిలో ఉండే కాంపోనెంట్స్ సాయంతో బ్లాక్ చేసేశారు. శాంసంగ్ టీవీ సెట్స్ లో బ్లాక్ ఫంక్షన్ ప్రీ లోడెడ్ గా ఉండటంతో అది సాధ్యమైంది.

తమ కంపెనీ ప్రొడక్ట్ లను ప్రొటెక్ట్ చేయడం కోసమే ఈ టెక్నాలజీ వినియోగించామని శాంసంగ్ వివరించింది. పలు మార్కెట్లలో జరిగే చట్టవ్యతిరేక వ్యాపారాలను అడ్డుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.

సామాజిక మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని మారుస్తూ వస్తున్నాం. కొత్త ప్రపంచాన్ని సృష్టించే దిశగా డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ, పర్పస్ బిల్ట్, ఇన్నోవేటివ్, ఇన్‌ట్యూటివ్ బిజినెస్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రెడీ చేశారు. ఈ టెక్నాలజీ మొదలుపెట్టినప్పటి నుంచి పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇండస్ట్రీ, కస్టమర్లు భవిష్యత్ లో దీనికే ఇంటరెస్ట్ చూపిస్తారని ఆశిస్తున్నామని దక్షిణాఫ్రికా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ డైరక్టర్ మైక్ వాన్ లైర్ అంటున్నారు.

టీవీ బ్లాక్ ఫీచర్ ను శాంసంగ్ యాక్టివేట్ చేసి దొంగతనాల నుంచి టీవీలు కాపాడుకునేందుకు రిటైలర్లకు హెల్ప్ అయింది. దీని గురించి స్టేట్మెంట్ రిలీజ్ చేసి.. టీవీ బ్లాక్ అయ్యే ప్రాసెస్ గురించి.. కంపెనీ వేర్ హౌజ్ లో.. వివరించారు. బ్లాక్ అయిన టీవీకి ఒక్కసారి ఇంటర్నెట్ కనెక్ట్ అయిందా అంతే ఇక బ్లాక్ అయిపోయి ఏ ఫంక్షన్ పని చేయదు.

ఇందులో వచ్చిన ఇబ్బందేంటంటే.. తప్పుగా లాగిన్ చేసినా టీవీ బ్లాక్ అయిపోతుంది. ఇటువంటి ఘటనలు జరిగి చాలా మంది కస్టమర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.