Sundar Pichai: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఉద్యోగులకు గూగుల్‌ సీఈవో కీలక సూచనలు!

Sundar Pichai : అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు.

Sundar Pichai sends a stark memo to Google employees ahead of US result day

Sundar Pichai : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమ సెర్చ్ దిగ్గజం ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక మెమోను మెయిల్ ద్వారా పంపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు?  ఈ ఎన్నికల ఫలితాల వేళ అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార వనరుగా కంపెనీ ఉండాలని పిచాయ్ కోరినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

గతంలో అమెరికా ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ పరంగా అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి అలాంటి ఆస్కారం లేకుండా ఉండేలా ముందుగానే గూగుల్ తమ ఉద్యోగులను అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగానే సుందర్ పిచాయ్ మెమో ద్వారా కంపెనీ ఉద్యోగులకు సూచనలు చేశారు.

ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందుకు బిగ్ టెక్ కంపెనీలు చేస్తున్న ప్రయత్నంగా పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంపై విచారణ జరుపుతామంటూ విమర్శించారు.

తాను ఎన్నికల్లో గెలిస్తే గూగుల్ మాత్రం తన గురించి చెడు కథనాలను మాత్రమే చూపుతుందని ట్రంప్ ఆరోపించారు. గూగుల్ చట్టవిరుద్ధంగా ఉపయోగించారు. కొందరు తమ ప్రయోజనం కోసం ఇలా రూపొందించారు. అదే సమయంలో, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ గురించి మంచి కథనాలను మాత్రమే కనిపించేలా చేస్తారు” అని ట్రంప్ తన సోషల్ నెట్‌వర్క్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

“ఇది చట్టవిరుద్ధమైన చర్య. ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలను న్యాయ శాఖ విచారిస్తుందని ఆశిస్తున్నాం. కాకపోతే, మన దేశ చట్టాలకు లోబడి, నేను ఎన్నికల్లో గెలిచి, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడయ్యాక, లోతుగా విచారణ జరిపించాలని ప్రాసిక్యూషన్‌ను అభ్యర్థిస్తాను ”అని ట్రంప్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. 2019లో, వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ తన గురించి ప్రతికూల వార్తా కథనాలను మాత్రమే చూపించిందంటూ ట్రంప్ ఆరోపించారు. ఆ సమయంలో గూగుల్ ట్రంప్ ఆరోపణలను తోసిపుచ్చింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం తూర్పు, మధ్య యునైటెడ్ స్టేట్స్ అంతటా జరుగుతోంది. ఆ ప్రారంభ ఓట్లలో జార్జియా, నార్త్ కరోలినా, విజేతను నిర్ణయించే ఇతర స్వింగ్ రాష్ట్రాల్లో రికార్డు సంఖ్యలు నమోదయ్యాయి. ట్రంప్, హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఈసారి ఎన్నికల్లో ఎవరిది గెలుపు అనేదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Read Also : US elections 2024 : అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలయమ్స్.. ఎలా ఓటు వేస్తారంటే?