Tata Neu App : టాటా సూపర్‌ యాప్‌ ‘న్యూ’.. అన్ని సర్వీసులు, పేమెంట్లు ఇక్కడే..!

Tata Neu App : అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ దిగ్గజాలకు పోటీగా మరో సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. నిత్యావసరాల నుంచి విమాన టికెట్ల వరకు అన్ని పేమెంట్లు చేసుకోవచ్చు.

Tata Neu Launched In India One Super App To Buy Flight Tickets, Groceries And More

Tata Neu App : ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ దిగ్గజాలకు పోటీగా మరో సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. నిత్యావసర సరుకుల నుంచి విమాన టికెట్ల వరకు అన్ని పేమెంట్లు ఈ సూపర్ యాప్ ద్వారానే చేసుకోవచ్చు. డబ్బులు పంపుకోవచ్చు.. మొబైల్ యూటిలిటి పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అన్ని సర్వీసులు ఒకే ప్లాట్ ఫాంపై అందిస్తోంది టాటా గ్రూప్.. అదే.. టాటా న్యూ (Tata Neu) సూపర్ యాప్.. టాటా గ్రూపు ఈ సరికొత్త సూపర్ యాప్ లాంచ్ చేసింది. ఈ కామర్స్ ప్లాట్ ఫాంపై భారీ పోటీ నెలకొన్న తరుణంలో టాటా గ్రూపు ఈ సూపర్ యాప్ తో ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిలయన్స్‌ జియో మార్ట్‌ మాదిరిగానే ఈ యాప్‌తో గట్టి పోటీ ఇస్తామని టాటా గ్రూప్‌ చెబుతోంది. ఈ కొత్త టాటా న్యూ యాప్‌ ద్వారా యూజర్లకు మరింత చేరువ కానున్నట్టు టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు.

‘ఇది న్యూ రోజు. టాటా కుటుంబంలో టాటా డిజిటల్‌ ఒకటి వచ్చి చేరింది. టాటా న్యూను ఆవిష్కరించింది. మా అన్ని బ్రాండ్‌లను ఒకేచోట నిలిపే పవర్ ఫుల్ సూపర్ యాప్‌ టాటా న్యూ. వినియోగదారుల సౌకర్యాన్ని అందించడమే మా లక్ష్యం. విశ్వాసానికి టాటా న్యూ వేదికగా నిలుస్తుంది వినియోగదారుల తగినట్టుగా అవసరమైన మార్పులు చేస్తాం’ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. గత ఏడాది నుంచి ఈ యాప్‌ను టెస్టింగ్ చేసిన అనంతరం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిరేషియా, క్రోమా, ఐహెచ్‌సీఎల్‌, బిగ్‌బాస్కెట్‌, క్యూమిన్‌, స్టార్‌బక్స్‌, టాటా 1MG, టాటా క్లిక్‌, టాటా ప్లే, వెస్ట్‌సైడ్‌ వంటి బ్రాండ్‌లు టాటా న్యూ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. విస్తారా, ఎయిరిండియా, టైటన్‌, తనిష్క్‌, టాటా మోటార్స్‌ కంపెనీలను కూడా అతి త్వరలో యాప్ లో చేరుస్తామని టాటా కంపెనీ వెల్లడించింది.

Tata Neu Launched In India One Super App To Buy Flight Tickets, Groceries And More 

ఈ సూపర్ యాప్ ద్వారా ఎయిరేషియా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. తాజ్‌ హోటళ్లలో గదులతో పాటు క్రోమాలో ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలు చేసుకోవచ్చు. బ్యూటీ, లగ్జరీ సౌకర్యాలను పొందవచ్చు. టాటా స్కై అకౌంట్‌తో శాటిలైట్‌ టీవీ సర్వీసులకు పేమెంట్లు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫోన్‌ రీచార్జ్, బిల్లులు పేమెంట్లు చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణాలు, బీమా పాలసీలను పొందవచ్చు. ఎంటర్ టైన్మెంట్ కంటెంట్ కూడా చూడవచ్చు. మీకు నచ్చిన ఫుడ్ ఆన్ లైన్ లోనే ఈ సూపర్ యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. యూజర్లను ఆకట్టుకునేందుకు లాయల్టీ స్కీమ్ కూడా టాటా న్యూ అందిస్తోంది. ప్రతి కొనుగోలుపై రివార్డు పాయింట్లు పొందవచ్చు. అంటే.. ‘న్యూకాయిన్స్‌’ సొంతం చేసుకోవచ్చు. టాటా న్యూ యాప్‌ ప్రాజెక్ట్‌ అంతా చంద్రశేఖరన్‌ పర్యవేక్షణలోనే జరిగింది. టాటా డిజిటల్‌ సీఈఓ ప్రతీక్‌ పాల్‌ కీలక పాత్ర పోషించారు.

Read Also :  Whatsapp Voice Message Malware : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. క్లిక్ చేశారో మీ డబ్బులు మాయం