Tata Punch మైక్రో SUV కారు వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) కస్టమర్లను ఎప్పటినుంచో ఊరిస్తోన్న కొత్త మోడల్ Tata Punch మైక్రో SUV కారు వచ్చేసింది. అక్టోబర్ 4న మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

Tata Punch micro SUV : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) కస్టమర్లను ఎప్పటినుంచో ఊరిస్తోన్న కొత్త మోడల్ కారు వచ్చేసింది. Tata Punch మైక్రో SUV కారును అక్టోబర్ 4 (సోమవారం) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ మోడల్ కారు నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ALFA-ARC (Agile Light Flexible Advanced Architecture) ఫ్లాట్ ఫారం ఆధారంగా పనిచేస్తుంది. టాటా మోటార్స్ కార్లలో పాపులర్ మోడల్ (Altroz) మాదిరిగా Impact 2.0 డిజైన్ లాంగ్వేజ్‌తో డెవలప్ చేసింది కంపెనీ. ఈ రోజు నుంచే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన కస్టమర్లు టాటా మోటార్స్ డీలర్ షిప్స్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.21వేలు చెల్లించి టాటా పంచ్ కొత్త కారును బుకింగ్ చేసుకోవచ్చు.

కస్టమర్ల కోసం టాటా మోటార్స్ Punch కారు వర్చువల్ షోరూం కూడా లాంచ్ చేసింది. మీకు నచ్చిన వేరియంట్ ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. Tata Punch మోడల్ కారు ధర వివరాలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. టాటా పంచ్ వేరియంట్ 15 లేదా 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ పై రన్ అవుతుంది.

కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్, 187mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. SUV DNA కార్లలో 370mm వాటర్ వాడింగ్ కేపబులిటీతో వచ్చింది. టాటా పంచ్ 1.2-లీటర్ రీవోట్రాన్ ఇంజిన్ డైనా-ప్రో టెక్నాలజీతో వచ్చింది. 86PS పవర్, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో రన్ అవుతుంది.
Samsung Galaxy M22 : శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇదే.. ఇండియా సపోర్టు పేజీలో లైవ్!

AMT Gearbox లతో నడిచే ఈ సరికొత్త కారు.. బురద లేదా తక్కువ ట్రాక్షన్ ఉపరితలాలపై నుంచి కూడా సులభంగా దూసుకెళ్లగలదు. ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచడంతో పాటు ట్యూనింగ్ మ్యాప్స్ కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇంజిన్ ఆటోమేటిక్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో idle Start-stop వంటి క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి.

టాటా పంచ్ ఇంటీరియర్స్ విశాలండా ఉండేలా డిజైన్ చేసింది. కారులోని డ్యాష్ బోర్డ్ 4 అంగుళాల లేదా 7 అంగుళాల హర్మన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ (Harman infotainment system)తో వచ్చింది. అలాగే 7 అంగుళాల TFT ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తో వచ్చింది.

స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ద్వారా సులభంగా డ్రైవింగ్ చేయొచ్చు. టాటా పంచ్ కారు రియర్ సీట్లు ప్లాట్ ఫ్లోర్ తో సౌకర్యవంతమైన సీటింగ్ అమర్చారు. డ్రైవర్, ప్యాసింజర్లు తమ వస్తువులను దాచుకునేందుకు 25 రకాల యూటిలిటీ స్టోర్లు అమర్చారు. మైక్రో SUV కారులో 366 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందించారు. టాటా పంచ్ నాలుగు వేరియెంట్లలో అందుబాటులోకి వచ్చింది. రెండు పర్సనాలో Pure, Adventure పేరుతో వచ్చింది. అనేక సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంది.

అందులో రెండు ఎయిర్ బ్యాగులు, ABS, EBD, కార్నర్ సేఫ్టీ కంట్రోల్, ISOFIX, brake sway కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. టాటా పంచ్ (Tata Punch) కొత్త కారు మొత్తం ఏడు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అందులో Orcus White, Atomic Orange, Daytona Grey, Meteor Bronze, Calypso Red, Tropical Mist, Tornado Blue కలర్ ఆప్షన్లు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే బుకింగ్ చేసుకోవచ్చు.
Nobel Prize In Medicine : మెడిసిన్ విభాగంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్

ట్రెండింగ్ వార్తలు