Tech Tips : మీ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఇలా చేయండి.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!

Tech Tips : స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. ప్రతిఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్లలోనే ఎక్కువగా మొబైల్ డేటాను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్లలో మొబైల్ డేటా స్పీడ్ నెమ్మదిగా ఉంటే ఎవరికైనా చికాకు కలిగిస్తుంది.

Tech Tips : మీ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఇలా చేయండి.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!

Smartphone-Internet-Speed

Updated On : February 16, 2023 / 7:56 PM IST

Tech Tips : స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. ప్రతిఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్లలోనే ఎక్కువగా మొబైల్ డేటాను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్లలో మొబైల్ డేటా స్పీడ్ నెమ్మదిగా ఉంటే ఎవరికైనా చికాకు కలిగిస్తుంది. కొన్సిసార్లు బ్రౌజింగ్ చేసే సమయంలో ఇంటర్నెట్ డేటా స్లోగా ఉంటుంది. నెమ్మదైన ఇంటర్నెట్ కారణంగా UPI పేమెంట్స్ చేసుకోవడం లేదా అత్యవసర ఈ-మెయిల్ లేదా మెసేజ్ పంపడం వంటి ముఖ్యమైన పనులకు అంతరాయం ఏర్పడుతుంది. లొకేషన్, ఈరోజు సమయం, నెట్‌వర్క్ ట్రాఫిక్ వంటి అనేక అంశాలు మీ ఇంటర్నెట్ స్పీడ్‌పై ప్రభావితం పడుతుంది.

wi-fi కవరేజ్ ఏరియాలో ఉండటం ఎల్లప్పుడూ సాధ్యం కాదని గమనించాలి. అదనంగా, మీ స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేయడం, ఆన్ చేయడం కూడా పెద్దగా వర్కౌట్ కాదనే చెప్పాలి. అయితే, అప్పుడు ఏమి చేయాలి? అంటే.. మీరు మీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవడానికి మీ డేటా డౌన్‌లోడ్ అప్‌లోడ్ స్పీడ్ రెట్టింపు చేయడానికి అద్భుతమైన ట్రిక్ ఒకటి ఉంది. అయితే, మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ని ఎలా చెక్ చేయాలి? మీ డేటా స్పీడ్‌ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఎలా చెక్ చేయాలి? :
మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేయడానికి అనుమతించే అనేక యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఉన్నాయి. (Ookla Speedtest) లో అలాంటి యాప్ లేదా వెబ్‌సైట్ ఒకటి అందుబాటులో ఉంది. Ookla Speedtestని ఉపయోగించి మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు.

Smartphone-Internet-Speed

Smartphone-Internet-Speed

Speedtest.netని విజిట్ చేయండి లేదా మీ మొబైల్ డివైజ్‌లోని యాప్ స్టోర్ నుంచి Ookla Speedtest యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
– స్పీడ టెస్టును ప్రారంభించడానికి యాప్‌ని ఓపెన్ చేసి ‘GO’ బటన్‌పై Tap చేయండి.
– ఇప్పుడు యాప్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్.. అలాగే పింగ్‌ను టెస్టింగ్ ద్వారా మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ డిటెక్ట్ చేస్తుంది.
– టెస్ట్ పూర్తయిన తర్వాత.. యాప్ మీ డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో పాటు మీ Pingతో సహా రిజల్ట్స్ అందిస్తుంది.

ఇప్పుడు మీ ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే.. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచడానికి కనెక్ట్ అయ్యేలా మీ DNS సర్వర్‌ని మార్చుకోవాల్సి ఉంటుంది.

Read Also : Tech Tips : వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచడానికి DNS ఛేంజర్ యాప్‌ని ఉపయోగించండి :
గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లో Android డివైజ్‌ల కోసం DNS Changer, 1.1.1.1: స్పీడ్ & సేఫ్ ఇంటర్నెట్ Google DNS Changer వంటి అనేక DNS ఛేంజర్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఉపయోగించాలనుకుంటున్న యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

– మీ మొబైల్ డివైజ్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి.
– ఇప్పుడు మీ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేసేందుకు యాప్‌కి అవసరమైన అనుమతులను ఇవ్వండి.
– మీరు ఉపయోగించాలనుకుంటున్న DNS సర్వర్‌ని ఎంచుకోండి.
– మీరు యాప్ అందించిన డిఫాల్ట్ DNS సర్వర్‌ని ఉపయోగించవచ్చు.
– మీరు ఉపయోగించాలనుకుంటున్న DNS సర్వర్ IP అడ్రస్ మాన్యువల్‌గా ఎంటర్ చేయవచ్చు.
– మీరు వేర్వేరు DNS సర్వర్ స్పీడ్ కూడా ఎంచుకోవచ్చు. చెక్ చేయవచ్చు లేదా స్పీడ్ సర్వర్‌ను ఎంచుకోవచ్చు.
– కొత్త DNS సర్వర్‌ని యాక్టివేట్ చేయడానికి Start బటన్‌ను Tap చేయండి.
– మీరు ఇప్పుడు కొత్త DNS సర్వర్ మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెరిగిందో లేదో చెక్ చేయడానికి స్పీడ్ టెస్ట్‌ని ట్రై చేయొచ్చు.

ముఖ్యంగా, మీ ఆన్‌లైన్ సెక్యూరిటీ, ప్రైవసీని నిర్ధారించడానికి సేఫ్ DNS సర్వర్‌ను ఎంచుకోండి :

Smartphone-Internet-Speed

Smartphone-Internet-Speed

మీ DNS సర్వర్‌ని మార్చడం కాకుండా మీ మొబైల్ ఇంటర్నెట్‌ని స్పీడ్ చేసే కొన్ని ఇతర టిప్స్ ఇక్కడ ఉన్నాయి.

– Cache, Cookies క్లియర్ చేయండి : మీ మొబైల్ డివైజ్‌లో Cache, Cookies క్లియర్ చేస్తే.. మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను స్పీడ్‌గా చేస్తుంది.
– డేటా సేవింగ్ మోడ్‌ని ON చేయండి.
– బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయండి. ఒకేసారి చాలా యాప్‌లను రన్ చేయడం వల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గించవచ్చు.
– RAMని ఖాళీ చేసేందుకు మీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచాలంటే రన్ అయ్యే యాప్‌లను క్లోజ్ చేయండి.
– ఆటో-అప్‌డేట్‌లను నిలిపివేయండి.
– ఆటోమేటిక్ అప్‌డేట్‌లు చాలా డేటాను వినియోగిస్తాయి. దీని వలన ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదించవచ్చు.
– యాప్‌ల కోసం ఆటోమేటిక్ అప్‌డేట్‌లను OFF చేయండి.

Read Also : Whatsapp Tricks : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ట్రిక్.. టైప్ చేయకుండానే మెసేజ్, కాల్స్ చేసుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!