WhatsApp Messages : వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా?

WhatsApp Messages : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల ప్రైవసీ విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతోంది.

WhatsApp Messages : వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా?

Tech Tips _ How to read WhatsApp messages without letting the sender know

Updated On : September 22, 2024 / 12:18 AM IST

WhatsApp messages : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల ప్రైవసీ విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతోంది. వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ప్రైవేట్ మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం WhatsApp ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేక ప్రైవసీ ఫీచర్లను అందిస్తుంది. సాధారణంగా వాట్సాప్‌లో ఫీచర్ రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేసే వీలుంది. ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత.. అవతలి వైపు ఉన్న వ్యక్తి తమ మెసేజ్‌లను చదివారా లేదా అనేది వినియోగదారులు తెలుసుకోలేరు. కానీ ఫీచర్‌లో ఒక లోపం ఉందని గమనించాలి.

ఈ ఫీచర్ పంపినవారు, రిసీవర్ రెండింటికీ రీడ్ రిసిప్ట్‌లను కూడా నిలిపివేస్తుంది. తద్వారా వారి WhatsApp మెసేజ్‌లు చదువుతున్నారా? లేదా అని ఎవరూ చెక్ చేయలేరు. ఇప్పుడు చాట్ ఓపెన్ చేయకుండా లేదా అవతలి వ్యక్తికి తెలియకుండా మెసేజ్‌లను ఎలా చదవాలి? అంటారా? వాట్సాప్ చాట్‌ని ఓపెన్ చేయకుండా లేదా పంపినవారికి తెలియకుండా ఉండేలా WhatsApp మెసేజ్ చదవగలిగే కొన్ని టెక్ టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ మెసేజ్‌లను చదువుకోవచ్చు.

వాట్సాప్ బ్లూ టిక్ సెట్టింగ్‌లను ఎలా ఆఫ్ చేయాలంటే? :
కానీ, అన్ని ఇతర ‘అనధికారిక పద్ధతుల’ కన్నా ముందు వాట్సాప్ అధికారిక ఫీచర్‌ను ఓసారి చూద్దాం.. ఇది రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేస్తుంది.. అంటే బ్లూ టిక్‌ను ఆఫ్ చేస్తుందని గమనించాలి. WhatsApp రీడ్ రిసిఫ్ట్ ఆఫ్ చేయడానికి WhatsApp Settings > Account > Privacyకి వెళ్లి, రీడ్ రిసిఫ్ట్ ఆప్షన్ OFF చేయండి. మీరు రీడ్ రిసిఫ్ట్‌లను ఆఫ్ చేయకుండానే మెసేజ్ చూడగలిగే కొన్ని ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ : ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, షావోమీ 14పై భారీ డిస్కౌంట్లు..!

Airplane మోడ్‌ని ఆన్ చేయండి :
వాట్సాప్‌లో మెసేజ్ ఓపెన్ చేయడానికి ముందు మీ డివైజ్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయండి. ఈ పద్ధతి ద్వారా పంపిన మెసేజ్ కండిషన్ అప్‌డేట్ చేయకుండా వాట్సాప్ నిరోధిస్తుంది. Settings Airplane Mode Turn on ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చాట్ చదవండి. ముఖ్యంగా, మీరు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఆఫ్ చేసి, ఆన్‌లైన్‌కి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఫీచర్ కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, WhatsApp మెసేజ్‌ల రీడ్ స్టేటస్‌ను అప్‌డేట్ చేయవచ్చు.

నోటిఫికేషన్ బార్ ద్వారా చూడొచ్చు :
ఇది చాలా సులభమైనది.చాట్ విండోను ఓపెన్ చేయకుండానే WhatsApp మెసేజ్ చదవచ్చు. నోటిఫికేషన్ విండోను కిందికి స్ర్కోల్ చేయండి. అక్కడ నోటిఫికేషన్ బార్‌లో మెసేజ్ నేరుగా చూడండి. అయితే, మీరు త్వరితగతిన చూడాలి. ఒకసారి రెండు లేదా మూడు మెసేజ్‌లు ఉంటే మాత్రం మీరు ఆయా మెసేజ్‌లను చూడలేరు.

పాప్-అప్ నోటిఫికేషన్‌ను ఆన్ చేయండి :
మీరు మెసేజ్ నోటిఫికేషన్‌ను పాప్-అప్‌గా కనిపిస్తుంది. పాప్-అప్ నోటిఫికేషన్‌ను ఆన్ చేయడానికి > Open WhatsApp > upper right corner ట్యాప్ చేయండి > Settings > Notifications > Popup notification > Always show the popup ఎంపిక చేయండి.

నోటిఫికేషన్‌ని Tap చేసి పట్టుకోండి :
ఐఫోన్ వినియోగదారులు మెసేజ్ ప్రివ్యూని చూడటానికి వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్‌ను Tap చేసి పట్టుకోవచ్చు. హోమ్ స్క్రీన్‌కి WhatsApp యాప్ విడ్జెట్‌ని యాడ్ చేయండి. WhatsApp విడ్జెట్‌లు మీ కాంటాక్టుల ద్వారా నోటిఫికేషన్‌లు, స్వీకరించిన మెసేజ్‌లను కూడా చూడవచ్చు. మీరు యాప్‌ను ఓపెన్ చేయకుండానే విడ్జెట్‌ల నుంచి నేరుగా ఈ మెసేజ్‌లను చదవవచ్చు.

మీ డివైజ్ హోమ్ స్క్రీన్‌పై WhatsApp విడ్జెట్‌ కోసం :
హోమ్ స్క్రీన్‌పై Tap చేసి పట్టుకోండి> మీ డివైజ్‌లో విడ్జెట్‌ల లిస్టును స్క్రోల్ చేయండి> WhatsApp విడ్జెట్‌ను యాడ్ చేయండి.

లాస్ట్ మెసేజ్ చదవడానికి చాట్‌పై హోవర్ చేయండి :
ఈ టిప్ WhatsApp వెబ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. చివరి మెసేజ్ చూడటానికి కాంటాక్ట్ లిస్ట్‌పై మౌస్‌ని ఉంచండి. పంపినవారు పంపిన చివరి మెసేజ్ మౌస్ కర్సర్ పాయింట్ పెట్టడం ద్వారా చదవగలరు.

థర్డ్ పార్టీ యాప్ ద్వారా కూడా చదవచ్చు :
వాట్సాప్‌లో పంపినవారికి తెలియకుండా WhatsApp మెసేజ్ చదవడంలో మీకు సహాయపడే కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి. అయితే, థర్డ్-పార్టీ యాప్‌లు సురక్షితమైనవి లేదా నమ్మదగినవి కావని గమనించాలి.

Read Also : Samsung Galaxy S24 Price : శాంసంగ్ గెలాక్సీ ఫోన్ S24 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌‌లో ఇంకా తక్కువకే కొనేసుకోవచ్చు..!