How to remove password from a PDF file
PDF Password : ఆన్‌లైన్‌లో యూజర్ల ప్రైవసీ పరంగా అనేక సమస్యలు ఉన్నాయి. సాధారణంగా మనకు తెలియకుండానే పర్సనల్ డేటా లీక్ అవుతుంటుంది. సైబర్ నేరగాళ్లు యూజర్ల డేటాను హ్యాక్ చేసేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. అందులో ఎక్కువగా లింక్ క్లికింగ్ (Link Click), ఫిషింగ్ అని కూడా పిలుస్తారు. ఇలా పంపిన లింకుల్లో మాల్‌వేర్ వైరస్ ఉంటుంది.
పొరపాటున ఆయా లింకులను క్లిక్ చేస్తే అంతే సంగతులు.. మీ విలువైన డేటా సైబర్ నేరగాళ్ల చేతులకు చిక్కినట్టే. అందుకే యూజర్ల ప్రైవసీ ప్రొటెక్ట్ చేసేందుకు బ్యాంక్ వంటి ఇతర ఫైనాన్స్ సంస్థలు నెలవారీగా పంపే యూజర్ల స్టేట్ మెంట్లను పీడీఎఫ్ రూపంలో పంపిస్తుంటారు. ఈ ఫైల్స్ పాస్ వర్డ్ ప్రొటెక్ట్ (Password Protected) అయి ఉంటాయి. ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి పీడీఎఫ్ ఫైళ్లను యూజర్ ఈ-మెయిళ్లకు అటాచ్ చేసి పంపిస్తుంటారు. అయితే ఈ పీడీఎఫ్ ఫైళ్లను యాక్సస్ చేయాలంటే తప్పనిసరిగా పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ పీడీఎఫ్ ఫైళ్లకు సెక్యూరిటీ కోసం లాక్ వేస్తారు. ఇంతకీ ఇలాంటి మెయిళ్లలో పీడీఎఫ్ ఫైళ్లను ఓపెన్ చేయాలంటే ఆ పాస్ వర్డ ఎంటర్ చేయాల్సిందే. ఆ పాస్‌వర్డ్ ఏమని పెట్టారో తెలియకపోవచ్చు.
ఒకవేళ మెయిల్ పంపినవారిని సంప్రదించి పాస్ వర్డ్ తెలుసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు ఇలా పాస్‌వర్డ్ తెలుసుకోవడం సాధ్యపడదు. అలాంటి సమయంలో పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ పీడీఎఫ్ పైళ్లలో సెట్ చేసిన పాస్‌వర్డ్ ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పీడీఎఫ్ పాస్‌వర్డ్‌లను తీసివేయడం పెద్ద కష్టమేమీ కాదు.. పీడీఎఫ్ ని అన్‌లాక్ చేయడానికి లేదా పీడీఎఫ్ ఫైల్ నుండి పాస్‌వర్డ్‌ను తీసివేయడానికి మీరు ఈ కిందివిధంగా ఫాలో అవ్వండి. అవేంటో ఓసారి చూద్దాం.
Adobe Acrobat ఉపయోగించి PDF పాస్‌వర్డ్‌ను ఎలా తొలగించాలో తెలుసా?
* మీ ల్యాప్‌టాప్ లేదా PCలో Adobe Acrobat లో పీడీఎఫ్‌ని ఓపెన్ చేయండి.
* Tools ఎంచుకోండి > Encrypt > Remove Securityపై క్లిక్ చేయండి.
మీ డాక్యుమెంట్‌లో ‘Document Open’ పాస్‌వర్డ్ ఉంటే.. దాన్ని డిలీట్ చేసేందుకు Okపై క్లిక్ చేయండి.
మీ డాక్యుమెంట్ యాక్సస్ చేసేందుకు పాస్‌వర్డ్ ఉంటే.. ఆ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయండి. బాక్సులో సరైన పాస్‌వర్డ్‌ను టైప్ చేసి.. ఆపై OK క్లిక్ చేయండి.
మీరు ప్రస్తుత పాస్‌వర్డ్‌ను నమోదు చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ డాక్యుమెంట్ నుంచి పాస్‌వర్డ్‌ను తీసివేస్తుంది.
Android ఫోన్‌లో PDF పాస్‌వర్డ్‌ను ఎలా తొలగించాలంటే? :
Google Chromeలో PDF పాస్‌వర్డ్‌ను ఎలా తొలగించాలంటే? :
పైన పేర్కొన్న ఏదైనా పద్ధతులను అనుసరించి పీడీఎఫ్ పాస్‌వర్డ్‌లను తొలగించవచ్చు. మీరు ముందుగా పీడీఎఫ్ డాక్యుమెంట్ పాస్‌కోడ్ (PassCode)ను తెలుసుకోవాలని గమనించాలి. ఈ పద్ధతుల ద్వారా మీరు కేవలం సెక్యూరిటీ PINను మాత్రమే తొలగించవచ్చు.
Note : లాక్ చేసిన పీడీఎఫ్ నుంచి పాస్‌వర్డ్‌లను తొలగించడానికి ఏదైనా థర్డ్ పార్టీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా యాప్‌ని ఉపయోగించరాదు. ఎందుకంటే అది మీ డేటాను వారి డేటాబేస్‌లో సేవ్ చేయవచ్చు. మీ వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు తస్కరించే అవకాశం ఉంది.