iPhone Data Transfer : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఐఫోన్‌లపై భారీ డీల్‌లను అందిస్తున్నాయి. మీరు కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కొత్త ఫోన్‌ని కొనుగోలు చేసేందుకు బెస్ట్ టైంగా మారుతుంది.
ఎందుకంటే అలాంటి డీల్‌లు అన్ని సమయాలలో అందుబాటులో ఉండవు. మీరు కేవలం ఒక ఏడాదిలో పాత iPhone 13ని రూ.50వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. మీరు లేటెస్ట్ iPhone 14ని కొనుగోలు చేయాలంటే.. మీరు మీ HDFC కార్డ్ ద్వారా మీ పాత iPhone ఎక్స్చేంజ్ ద్వారా తక్కువ ధరకే పొందవచ్చు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో చాలా ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. మీ పాత ఐఫోన్ నుంచి మీ కొత్త ఐఫోన్‌కి డేటాను ఎలా బదిలీ చేయాలో తెలియాలంటే ఈ టెక్ టిప్స్ ఓసారి ట్రై చేయండి. ఆపిల్ ఐఫోన్‌లు ఆండ్రాయిడ్ ఫోన్‌ల మాదిరిగా పనిచేయవు. ఈ ఫోన్‌లను ఒకదానికొకటి పక్కన ఉంచడం ద్వారా మొత్తం డేటాను బదిలీ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
మీ కొత్త డివైజ్ ఆన్ చేసి, మీ పాత డివైజ్ దగ్గర ఉంచండి.
మీకు మీ కొత్త డివైజ్ సెటప్ ప్రాంప్ట్ కనిపిస్తుంది.
మీకు మీ పాత డివైజ్‌లో ప్రాంప్ట్ కనిపించకపోతే.. మీరు రెండు ఫోన్‌లను రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
మీ iPhoneని Wi-Fiకి లేదా మీ డివైజ్ సెల్యులార్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి.
మీ కొత్త ఫోన్‌లో Face ID లేదా Touch IDని సెటప్ చేయండి.
మీరు మీ డేటాను ఎలా బదిలీ చేయాలో ఇప్పుడు ఓ నోటిఫికేషన్ కనిపిస్తుంది.
మీ డేటా బదిలీ అవుతున్నప్పుడు మీరు మీ ఫోన్‌ని ఉపయోగించవచ్చు.
మీరు iCloud నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ యాప్‌లు, డేటా డౌన్‌లోడ్ నేపథ్యంలో మీరు వెంటనే మీ కొత్త డివైజ్ ఉపయోగించవచ్చు.
మీరు మీ పాత డివైజ్ నుంచి నేరుగా బదిలీ చేస్తే.. ముందు రెండు డివైజ్‌ల్లో బదిలీ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి.
మీరు మీ డివైజ్‌లను ఒకదానికొకటి పక్కన పెట్టుకోవాలి. డేటా మైగ్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రెండు డివైజ్‌లను పవర్‌కి ప్లగ్ ఇన్ చేయాలి.
నెట్‌వర్క్ కండిషన్, ట్రాన్స్ ఫర్ చేసే డేటా మొత్తం వంటి అంశాల ఆధారంగా ట్రాన్స్‌ఫర్ చేసే టైం మారవచ్చు.