Whatsapp Data Transfer : మీ వాట్సాప్ డేటాను ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..

Whatsapp Data Transfer : మీ పాత డివైజ్, కొత్త స్మార్ట్‌ఫోన్ ఒకే OSలో రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. మీ పాత డివైజ్ నుంచి కొత్తదానికి డేటాను ట్రాన్స్‌ఫర్ డేటా చేసుకోవచ్చు.

Whatsapp Data Transfer

Whatsapp Data Transfer : కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేశారా? అయితే మీ పాత స్మార్ట్ ఫోన్ డేటా ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలియదా? కొత్త గాడ్జెట్‌ని కొనుగోలు చేసే ముందు లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్‌లను ఓసారి చెక్ చేసుకోండి. మీ పాత డివైజ్, కొత్త స్మార్ట్‌ఫోన్ ఒకే OSలో రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. మీ పాత డివైజ్ నుంచి కొత్తదానికి డేటాను ట్రాన్స్‌ఫర్ డేటా చేసుకోవచ్చు. కానీ, మీరు Android నుంచి iOSకి లేదా మరో ఏదైనా డివైజ్‌కు మారినట్లయితే కొంచెం గందరగోళంగా ఉండొచ్చు. మీరు మీ వాట్సాప్ డేటా మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే.. ఆ ప్రాసెస్ చాలా పెద్దదిగా ఉండవచ్చు.

మీరు Android ఫోన్ నుంచి iPhoneకి మారుతున్నట్లయితే.. మీ WhatsApp అకౌంట్ డేటా, ప్రొఫైల్ ఫోటో, వ్యక్తిగత చాట్‌లు, గ్రూపు చాట్‌లు, చాట్ హిస్టరీ, మీడియా, సెట్టింగ్‌లను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. కానీ, మీరు మీ కాల్ హిస్టరీ లేదా ఇతర ఫోన్ యూజర్ల పేరును ట్రాన్స్‌ఫర్ చేయలేరు. మీ WhatsAppను Android నుంచి iOSకి లేదా iOSకి Androidకి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.

WhatsApp డేటాను Android నుంచి iOSకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే? : 
Android యూజర్లు తమ WhatsApp డేటాను ఇప్పటికే ఉన్న Android డివైజ్ నుంచి కొత్త iOS డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ‘move to iOS’ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు. WhatsApp పేమెంట్ & కాల్ హిస్టరీ డేటా ట్రాన్స్‌ఫర్ చేయడం కుదరదు. ఈ ఫోన్ సెటప్ చేయకపోతే మాత్రమే WhatsApp డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుందని పాఠకులు గమనించాలి. ఇప్పటికే డేటాను కలిగి ఉంటే.. ముందుగా దాన్ని రీసెట్ చేయాలని నిర్ధారించుకోండి.

* మీ Android డివైజ్‌లో Apple ‘Move to iOS’ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
* ఆండ్రాయిడ్‌లో ‘Move to iOS’ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి సూచనలను ఫాలో అవ్వండి.
* ఐఫోన్ ఒక కోడ్‌ని డిస్‌ప్లే చేస్తుంది. ప్రాంప్ట్ ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్‌లో కోడ్‌ని నమోదు చేయండి.
* బదిలీ డేటా స్క్రీన్‌పై ‘WhatsApp’ని ఎంచుకుని Startపై నొక్కండి.
* WhatsApp Export కోసం డేటాను రెడీ చేస్తుంది. అది పూర్తయిన తర్వాత Sign Out చేస్తుంది.
* ఐఫోన్‌కి డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ‘Move to iOS’ అప్లికేషన్‌కి తిరిగి వెళ్లి ‘Continue’పై Tap చేయండి.
* డేటా బదిలీ పూర్తయిన తర్వాత మీ iPhoneలో లేటెస్ట్ WhatsAppని ఇన్‌స్టాల్ చేయండి.
* అదే మొబైల్ ఫోన్ నంబర్‌తో లాగిన్ చేయాలి. డేటాను Start బటన్‌పై Tap చేయండి.
* ప్రాసెస్ పూర్తయిన తర్వాత.. వాట్సాప్ చాట్‌లు కొత్త ఐఫోన్‌లో కనిపిస్తాయి.
* WhatsApp డేటాను iOS నుంచి Androidకి ఎలా బదిలీ చేయాలి.

IOS నుంచి Androidకి డేటాను బదిలీ చేయడానికి Meta సపోర్టును కూడా ప్రారంభించింది. iPhone నుంచి కొత్త Android డివైజ్‌లకు మారే యూజర్లకు సాయపడుతుంది. మీ కొత్త Android స్మార్ట్‌ఫోన్ Android 12 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లో ఉండాలి. మీ Android డివైజ్ తప్పనిసరిగా కొత్తది లేదా ఫ్యాక్టరీ రీసెట్ అయి ఉండాలి.

* USB Type-C నుంచి కేబుల్‌ని ఉపయోగించి మీ iPhoneని మీ Android డివైజ్‌కు కనెక్ట్ చేయండి.
* ఎంచుకున్న మొత్తం డేటాను iPhone నుంచి Android డివైజ్‌కు Import చేయడానికి సూచనలను ఫాలో అవ్వండి.
* Continue ఆప్షన్ Tap చేయండి.
* మీ iPhone ద్వారా Android డివైజ్‌లో కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేయండి.
* Android డివైజ్‌లో WhatsAppని సెటప్ చేయండి. WhatsApp చాట్‌లు కనిపిస్తాయి.

Read Also : Flipkart Utsav Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఉత్సవ్ సేల్ మొదలైందోచ్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు..!