Tech Tips in Telugu : మీ పర్సనల్ డేటా డేంజర్లో.. జస్ట్ నిమిషాల్లోనే గూగుల్ సెర్చ్ నుంచి ఇలా డిలీట్ చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
Tech Tips in Telugu : గూగుల్‌లో మీ డేట్ లీక్ అయిందని అనుమానంగా ఉందా? గూగుల్ నుంచి మీ సమాచారాన్ని డిలీట్ చేయడం చాలా ఈజీ. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Tech Tips in Telugu
- గూగుల్ సెర్చ్‌లో మీ పర్సనల్ డేటా లీక్ అయిందా?
- పర్సనల్ డేటా గూగుల్ సెర్చ్ నుంచి ఈజీగా డిలీట్ చేయొచ్చు
- మీ వ్యక్తిగత డేటా ఏదైనా ఇలా సింపుల్‌గా కనిపించకుండా చేయొచ్చు
Tech Tips in Telugu : మీ పర్సనల్ డేటా గూగుల్‌లో లీక్ అయిందని భావిస్తున్నారా? గూగుల్ నుంచి మీ వ్యక్తిగత వివరాలను ఈజీగా డిలీట్ చేయొచ్చు. గూగుల్ నుంచి లీక్ అయిన మీ డేటాను డిలీట్ చేసేందుకు అనేక సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ రిమూవల్ టూల్ ఉపయోగించండి :
ముందుగా, గూగుల్ సెర్చ్ బార్‌కు వెళ్లి ఈ లింక్‌పై క్లిక్ చేయండి (https://support.google.com/websearch/troubleshooter/3111061)
ఆ తర్వాత ‘Remove information you see in Google search” అనే ఆప్షన్ ఎంచుకోండి.
ఇప్పుడు మీ సమస్యను ఎంచుకోండి (ఉదాహరణ.. అడ్రస్, ఇమెయిల్, ఫోన్ నంబర్).
మీ స్క్రీన్షాట్లు, యూఆర్ఎల్స్ (Tech Tips in Telugu) సమర్పించండి.
గూగుల్‌లో లీక్ అయిన బ్యాంకు వివరాలు, ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఇమెయిల్‌లను రిమూవ్ చేయాలి.
‘Results About You’ ఎలా చెక్ చేయాలి? :
గూగుల్ యూజర్లకు ఇంటర్నల్ ప్రైవసీ అసిస్టెంట్ కూడా అందిస్తుంది.
ఇది ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోవచ్చు.
ముందుగా గూగుల్ సెర్చ్‌లో మీ పేరును సెర్చ్ చేయండి.
ఆ తర్వాత, ఏదైనా రిజల్ట్ పక్కన కనిపించే త్రి డాట్స్ (⋮) టైప్ చేయండి.
ఇప్పుడు ‘Remove Result’ ఆప్షన్ ఎంచుకోండి.
మెయిన్ సోర్సెస్ నుంచి మీ డేటాను డిలీట్ చేయండి.
గూగుల్ వెబ్సైట్లలో ఇప్పటికే ఉన్న డేటాను మాత్రమే సూచిస్తుంది. అసలైన డేటా వెబ్సైట్లో ఉంటుంది. గూగుల్‌లో కాదు. మీ సమాచారం ఒక వెబ్సైట్లో అందుబాటులో ఉంటే అది గూగుల్‌లో మళ్లీ కనిపించవచ్చు.
మీరు ఈ కిందివిధంగా ఫాలో అవ్వండి :
అన్నిటికంటే ముందుగా వెబ్సైట్ కంపెనీని సంప్రదించండి.
మీ సమాచారాన్ని డిలీట్ చేయమని వారిని కోరండి.
వెబ్‌సైట్‌లోని ‘Contact US’ పేజీని చూడండి లేదా డొమైన్ సమాచారం (WHOIS) ద్వారా కంపెనీని సంప్రదించండి.
మీ సమాచారం అసలు వెబ్సైట్ నుంచి డిలీట్ చేశాక గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ నుంచి కూడా ఆటోమాటిక్ (డీ-ఇండెక్స్)గా డిలీట్ చేస్తుంది.
డేటా బ్రోకర్ సైట్ల నుంచి మీ సమాచారాన్ని డిలీట్ చేయండి.
మీ డేటాను స్టోర్ చేసే వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకు.. వైట్పేజెస్, స్పోకియో వంటి సైట్లు మీ ఫోన్ నంబర్‌ను కూడా సేల్ చేయొచ్చు.
మీరు సంబంధిత వెబ్సైట్లో మీ ఫోన్ నంబర్, పేరు లేదా అడ్రస్ కోసం సెర్చ్ చేయండి.
ఆ తర్వాత ‘Opt-out’ లేదా ‘Remove my info’ అనే ఆప్షన్ ఎంచుకోండి.
ఈ ప్రాసెస్ కోసం కొంత సమయం పట్టొచ్చు. కానీ, క్రమంగా మీ డేటాను డిలీట్ చేయొచ్చు.
మీ సోషల్ మీడియా అకౌంట్లను లాక్ చేయండి
మీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను ప్రైవేట్‌గా పెట్టుకోండి.
మీ ఇమెయిల్, ఫోన్ నంబర్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారం పొరపాటున ఏదైనా సోషల్ మీడియా పోస్ట్‌లో షేర్ అయిందో లేదో చూసేందుకు పాత పోస్ట్‌లు, ట్యాగ్‌లను చెక్ చేయండి.
