Tech Tips In Telugu : గూగుల్ క్రోమ్‌లో మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ చాట్ ఎలా వాడాలో తెలుసా?
Tech Tips In Telugu : మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ (Microsoft Bing AI) చాట్ ఇప్పుడు (Google Chrome) వెబ్ బ్రౌజర్లో అందుబాటులో ఉంది. ఇంతకుముందు, యూజర్లు థర్డ్ పార్టీ బ్రౌజర్ల ద్వారా మాత్రమే (Bing Chat) చాట్‌ని యాక్సెస్ చేయగలరు.

How to use Microsoft Bing on Google Chrome Web Browser in Telugu
Tech Tips In Telugu : గత ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ (Bing AI) చాట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బింగ్ ఏఐ కొంతమంది యూజర్లకు ‘Feelings‘ని డెవలప్ చేసింది. కొన్ని సందర్భాల్లో, AI చాట్‌బాట్ వినియోగదారుల తప్పులను ఎత్తిచెప్పింది. చివరికి, మైక్రోసాఫ్ట్ బింగ్ ఆయా తప్పులను పరిష్కరించింది.
AI చాట్‌బాట్ ప్రారంభమైన 6 నెలలకు పైగా (Bing) ఇతర AI చాట్బాట్లతో పోటీగా నిలుస్తోంది. ఇంతకు ముందు లేని ఫీచర్లను కూడా బింగ్ ఏఐ చాట్ కలిగి ఉంది. ఇతర బ్రౌజర్లలో Bing AI చాట్‌ని యాక్సెస్ చేయగల సామర్థ్యం ఉంది. మీరు ఇప్పుడు (Google Chrome) ద్వారా (Bing AI) చాట్‌ని యాక్సెస్ చేయగలరని మైక్రోసాఫ్ట్ దిగ్గజం తెలిపింది.
క్రోమ్ డెస్క్‌టాప్ బ్రౌజర్ సపోర్టు :
Bing Chat, Bing Chat Enterprise ఇప్పుడు Windows, Mac, Linux కోసం క్రోమ్ డెస్క్‌టాప్ బ్రౌజర్లో (లేటెస్ట్ స్టేబుల్ ఛానల్ అప్డేట్ను ఉపయోగించి) సపోర్టు అందిస్తాయి. డెస్క్‌టాప్, మొబైల్లోని ఇతర బ్రౌజర్లకు సపోర్ట్ రాబోతుంది’ అని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. మీరు (Google Chrome Browser)లో Microsoft Bing AI చాట్‌ని ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రోమ్‌లో బింగ్ ఏఐ చాట్ వాడాలంటే? :
బింగ్ ఏఐ చాట్‌ని యాక్సెస్ చేయడానికి గూగుల్ సెర్చ్ వెళ్లి, (Microsoft Bing AI) అని టైప్ చేయండి. ప్రత్యామ్నాయంగా, మీరు సెర్చ్ బాక్స్ నుంచి నేరుగా (www.bing.com)ని కూడా విజిట్ చేయొచ్చు. ఆ తర్వాత, స్క్రీన్ టాప్ ఎడమవైపున చాట్ ట్యాబ్‌ను గుర్తించండి. ఐకాన్ మైక్రోసాఫ్ట్ బింగ్ లోగో కనిపించాలి. మీరు ట్యాబ్‌పై క్లిక్ చేసిన తర్వాత (Bing AI) చాట్ పాపప్ అవుతుంది. మీరు ఇప్పుడు (Microsoft Edge)ని ఉపయోగిస్తున్నప్పుడు చేసే విధంగానే మీ ప్రశ్నలను అడగవచ్చు. చాట్‌బాట్‌తో పరస్పర చర్య చేయవచ్చు.

Tech Tips In Telugu : How to use Microsoft Bing on Google Chrome
బింగ్ కోసం థర్డ్-పార్టీ వెబ్ బ్రౌజర్ సపోర్ట్‌ను ప్రకటించిన బ్లాగ్ పోస్ట్‌లో, బెస్ట్ బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎడ్జ్ బ్రౌజర్‌ని ఉపయోగించడం కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ యూజర్లను కోరింది. ఈ ఎక్స్పీరియన్స్ మీ ప్రైమరీ బ్రౌజర్లో బాగా పని చేస్తున్నప్పుడు, బెస్ట్ క్లాస్ బింగ్ చాట్ ఎక్స్పీరియన్స్ కోసం (Microsoft Edge) బ్రౌజర్లో బింగ్ ఉపయోగించమని యూజర్లను ప్రోత్సహిస్తూనే ఉంది. ఎడ్జ్ సుదీర్ఘ సంభాషణలు, చాట్ హిస్టరీ, మరిన్ని బింగ్ ఫీచర్లు బ్రౌజర్‌లోనే రూపొందించింది. బింగ్ కోసం బెస్ట్ బ్రౌజర్‌ని పొందడానికి ఫుల్ ఫీచర్ల విస్తృతిని పొందడానికి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి.. సైడ్‌బార్‌లోని బింగ్ చాట్ ఐకాన్ క్లిక్ చేయాలని బ్లాగ్ పోస్ట్ పేర్కొంది.