Tech Tips in Telugu : మీ స్నేహితుల LinkedIn ప్రొఫైల్ వారికి తెలియకుండా ఎలా చూడాలో తెలుసా? సీక్రెట్ టిప్ ఇదిగో..!
Tech Tips in Telugu : మీకు లింక్‌డిన్ (LinkedIn) అకౌంట్ ఉందా? అయితే, మీకు ఈ ట్రిక్ తెలుసా? మీ స్నేహితులు లేదా ఇతరుల లింక్‌డిన్ ప్రొఫైల్ వారికి తెలియకుండానే చూడొచ్చు. చాలామందికి తమ ప్రొఫైల్ చెక్ చేస్తున్నారంటే కలవరపడతారు.

Tech Tips in Telugu _ How to view someone’s LinkedIn profile without letting the person know
Tech Tips in Telugu : మీకు లింక్‌డిన్ (LinkedIn) అకౌంట్ ఉందా? అయితే, మీకు ఈ ట్రిక్ తెలుసా? మీ స్నేహితులు లేదా ఇతరుల లింక్‌డిన్ ప్రొఫైల్ వారికి తెలియకుండానే చూడొచ్చు. చాలామందికి తమ ప్రొఫైల్ చెక్ చేస్తున్నారంటే కలవరపడతారు. కొన్నిసార్లు ఎవరైనా మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే.. వెంటనే మీకు అలర్ట్ వస్తుంది. ఒకరకంగా ఇది యూజర్ల ప్రైవసీ కోసమే.. ప్రస్తుత సమయంలో టెక్నికల్ రంగంలో అనేక ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి. దాంతో ఉద్యోగాన్ని కోల్పోయినవారంతా కొత్త ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారు.
అందులో ఎక్కువగా సెర్చ్ చేసే ప్లాట్ ఫారం.. లింక్‌డిన్ (LinkedIn Jobs). ఇక్కడే అనేక మంది తమ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది రిక్రూటర్‌లను ఈ లింక్ డిన్ ప్రొఫైల్ ద్వారానే కాంటాక్ట్ అవుతుంటారు. కానీ, లింక్‌డిన్‌లో మీరు ఒకరి ప్రొఫైల్‌ని చెక్ చేసినప్పుడు.. అది వెంటనే యూజర్‌ను అలర్ట్ చేస్తుంది. మీరు ఒకరి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఎవరో చెక్ చేస్తున్నారని ఊహించుకోండి. ఆ యూజర్ అకౌంట్ ప్రొఫైల్ గురించి ఏం తెలుసుకుంటారు అనేకదా మీ డౌట్.. వాస్తవానికి ఇది చాలా ఇబ్బందికరమైనదే.. లింక్‌డిన్‌లో డిఫాల్ట్‌గా, ఎవరైనా మీ ప్రొఫైల్‌ను చూసినప్పుడు వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.
కానీ, మీరు సెట్టింగ్ (Settings)ని మార్చడానికి ఒక మార్గం ఉందని తెలుసా? లింక్‌డిన్‌లో ప్రైవేట్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రైవేట్ మోడ్‌లో ప్రొఫైల్‌ను చూసినప్పుడు.. మీరు ఆ యూజర్ ప్రొఫైల్‌ను ఎవరు చూశారు (whose profile you viewed) అనే సెక్షన్‌లో LinkedIn) మెంబరుగా కనిపిస్తారు.
అప్పుడు ప్రైవేట్ మోడ్‌లో ప్రొఫైల్‌లను చూడొచ్చు. మీకు మీరు చూసిన ప్రొఫైల్‌తో మీ ఇతర డేటా ఏదీ షేర్ కాదు. ఇప్పుడు, మీరు సెమీ-ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజ్ చేసినప్పుడు.. జాబ్ క్యాప్షన్, కంపెనీ, స్కూల్, ఇండస్ట్రీ వంటి మీ ప్రొఫైల్ ఫీచర్లు మీరు చూస్తున్న మెంబర్‌కు కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఆ వ్యక్తికి తెలియకుండా మీరు వారి లింక్‌డిన్ ప్రొఫైల్‌ను ఎలా చూడాలో తెలుసా? ఇదిగో ఈ కింది విధంగా ప్రయత్నించండి..

Tech Tips in Telugu _ How to view someone’s LinkedIn profile without letting the person know
* మీ LinkedIn హోమ్‌పేజీ ఎగువన ఉన్న ‘Me’ ఐకాన్‌పై Click చేయండి.
* డ్రాప్‌డౌన్ నుంచి ‘Settings & Privacy’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
* ఎడమ వైపున ఉన్న ‘Visibility’ ఆప్షన్‌పై Click చేయండి.
* మీ ‘profile & network’ సెక్షన్‌లో విజిబిలిటీలో మీరు ప్రొఫైల్ వ్యూ ఆప్షన్ల పక్కన ఉన్న Changeపై Click చేయాలి.
* మీరు బ్రౌజ్ చేయాలనకునే మోడ్‌ను ఎంచుకోండి. మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి.
* మీ పేరు, హెడ్‌లైన్, ప్రైవేట్ ప్రొఫైల్ ఫీచర్లు (జాబ్ క్యాప్షన్, ఇండస్ట్రీ) ప్రైవేట్ మోడ్
* మీ ప్రొఫైల్ వివరాలను హైడ్ చేసేందుకు ప్రైవేట్ మోడ్‌పై Click చేయండి.
* ముఖ్యంగా, మీ Changes ఆటోమాటిక్‌గా Save అవుతాయి.
ఇప్పుడు, మీరు (LinkedIn) ప్రీమియం మెంబర్‌షిప్ కలిగి ఉన్నట్లయితే.. మీరు ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజ్ చేయొచ్చు. గత 90 రోజులలో మీ ప్రొఫైల్‌ను వ్యూ చేసిన యూజర్ల లిస్టును ఇప్పటికీ చూడొచ్చు. మీరు మీ సొంత ప్రొఫైల్‌లో ప్రైవేట్ మోడ్ వ్యూ పేర్లను చూడలేరని గమనించాలి. ప్రైమరీ లేదా ఫ్రీ అకౌంట్లోతో సాధ్యం కాదని గుర్తించాలి.