Hyundai Motor Discounts : ఈ మార్చిలో హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. 12 మోడళ్లపై అదిరే ఆఫర్లు.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి!
Hyundai Motor Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్.. హ్యుందాయ్ కార్లపై ఆసక్తి గల కొనుగోలుదారులు మళ్లీ ధర పెరిగేలోపు ఇప్పుడే కొనేసుకోండి. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫిబ్రవరిలో భారీ విక్రయాలను పూర్తి చేసింది.

Hyundai Motor Discounts _ Creta, Venue, i10 Nios, i20, Aura _ Discounts up to Rs 38K in March
Hyundai Motor Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్.. హ్యుందాయ్ కార్లపై ఆసక్తి గల కొనుగోలుదారులు మళ్లీ ధర పెరిగేలోపు ఇప్పుడే కొనేసుకోండి. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఫిబ్రవరిలో భారీ విక్రయాలను పూర్తి చేసింది. అదే నెలలో దేశీయ అమ్మకాలు 6.7శాతం మేర పెరిగాయి.
అయితే, ఎగుమతులు 19.1శాతం పెరిగాయి. అమ్మకాలను మరింత పెంచేందుకు హ్యుందాయ్ మార్చిలో భారీ తగ్గింపులను అందిస్తోంది. మార్చిలో హ్యుందాయ్ అందించే అదిరే డిస్కౌంట్లను ఓసారి చూద్దాం.. భారత మార్కెట్లో హ్యుందాయ్ 12 మోడళ్లను విక్రయిస్తోంది. అందులో గ్రాండ్ i10 నియోస్, i20, i20 N లైన్, ఆరా, వెన్యూ, వెన్యూ N లైన్, వెర్నా, క్రెటా, అల్కాజార్, టక్సన్, కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 మోడళ్లు ఉన్నాయి.
క్రెటా కంపెనీ అత్యధికంగా అమ్ముడైన SUV కార్లలో ఒకటి. కార్‌మేకర్ వాల్యూమ్ డ్రైవర్‌లలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఒకటి. ఈ మోడల్ కారును కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మార్చిలో రూ. 38వేల వరకు మొత్తం డిస్కౌంట్లను అందిస్తోంది.

Hyundai Motor Discounts _ Creta, Venue, i10 Nios, i20, Aura
ఇందులో రూ. 25వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10 అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. హ్యుందాయ్ ఆరా కస్టమర్ కొనుగోలు చేసే వేరియంట్ ఆధారంగా రూ. 33వేల వరకు మొత్తం డిస్కౌంట్లను అందిస్తోంది. మొత్తం డిస్కౌంట్లలో రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేల అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది.
హ్యుందాయ్ i20కి రూ. 10వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేల అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మొత్తం రాయితీలు రూ. 20వేల వరకు అందిస్తోంది. కంపెనీకి చెందిన క్రెటా, వెన్యూ, అల్కాజార్, టక్సన్ వంటి SUVలకు మార్చిలో ఎలాంటి డిస్కౌంట్ అందించడం లేదు.
హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు హ్యుందాయ్ వెర్నా 2023 (Hyundai Verna)ను మార్చి 21న లాంచ్ చేయనుంది. మిడ్-సైజ్ సెడాన్ 6వ జనరేషన్ అవతార్ అందిస్తోంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా 2023 ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నాం.