Hyundai Alcazar 2023 Launch : అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ అల్కాజార్ 2023 వచ్చేసిందోచ్.. సూపర్ మైలేజ్, ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Hyundai Alcazar 2023 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి సరికొత్త హ్యుందాయ్ అల్కాజార్ 2023 (Hyundai Alcazar 2023) లాంచ్ అయింది.

Hyundai Alcazar 2023 Launch : అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ అల్కాజార్ 2023 వచ్చేసిందోచ్.. సూపర్ మైలేజ్, ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Hyundai Alcazar 2023 Launched _ New turbo petrol engine, enhanced safety

Hyundai Alcazar 2023 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) నుంచి సరికొత్త హ్యుందాయ్ అల్కాజార్ 2023 (Hyundai Alcazar 2023) లాంచ్ అయింది. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో అప్‌డేటెడ్ 6/7-సీటర్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) బుకింగ్‌లు రూ. 25వేల టోకెన్ మొత్తానికి గత నెలలోనే ప్రారంభమయ్యాయి.

సరికొత్త 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్, కొన్ని కొత్త ఫీచర్లను అందిస్తోంది. హ్యుందాయ్ అల్కాజార్ 2023 భారత మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్..160PS గరిష్ట శక్తిని, 253Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.

ఇంజిన్‌ను 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ DCTతో చేర్చవచ్చు. డీజిల్ ఆప్షన్ ఇష్టపడే వినియోగదారుల కోసం 1.5-లీటర్ CRDi డీజిల్ మిల్ కలిగి ఉంది. 116PS గరిష్ట శక్తితో పాటు 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ యూనిట్‌ను 6-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ AT టార్క్ కన్వర్టర్‌తో జాయిన్ చేయొచ్చు.

Read Also : Elon Musk Bodyguards : భయంభయంగా మస్క్.. బాత్‌రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు ఉండాల్సిందే.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

రెండు ఇంజన్‌లు రాబోయే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. అంతేకాదు.. హ్యుందాయ్ E20 ఇంధనానికి రెడీగా ఉన్నాయి. హ్యుందాయ్ ఆల్కాజర్ మైలేజ్ 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ MTకి 17.5కిమీగా, 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ DCTకి 18కిమీల వరకు మైలేజ్ అందిస్తుంది.

Hyundai Alcazar 2023 Launched _ New turbo petrol engine, enhanced safety

Hyundai Alcazar 2023 Launch : Hyundai Alcazar 2023 Launched _ New turbo petrol engine

హ్యుందాయ్ ఆల్కాజర్ (Hyundai Alcazar) లైనప్ నుంచి 2.0-లీటర్ MPi పెట్రోల్ మోటారు (159PS, 191Nm)ను తగ్గించింది. కొత్త ఇంజన్ కాకుండా, హ్యుందాయ్ అల్కాజార్ 2023 కొత్త గ్రిల్‌ను పొందింది. హ్యుందాయ్ ఇప్పుడు ‘ALCAZAR’ ఐకాన్ కలిగిన పుడ్ల్ ల్యాంప్ లోగోను కూడా అప్‌గ్రేడ్ చేసింది.

SUVలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్, ప్యాసింజర్, సైడ్, కర్టెన్) స్టాండర్డ్‌గా ఉన్నాయి. స్టాండర్డ్‌గా మరో ఫీచర్ ఐడిల్ స్టాప్ అండ్ గో అందిస్తుంది. హ్యుందాయ్ అల్కాజార్ 2023 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ నాలుగు వేరియంట్‌లలో ప్రెస్టీజ్, ప్లాటినం, ప్లాటినం(O), సిగ్నేచర్(O) లభిస్తుంది. ఈ వేరియంట్ ధరలు (ఎక్స్-షోరూమ్)లో ఇలా ఉన్నాయి.

* Prestige MT 7-seater – రూ. 16.75 లక్షలు
* Platinum MT 7-seater – రూ. 18.65 లక్షలు
* Platinum(O) DCT 7-seater – రూ. 19.96 లక్షలు
* Signature(O) DCT 7-seater – రూ. 20.25 లక్షలు
* Platinum(O) DCT 6-seater – రూ. 19.96 లక్షలు
* Signature(O) DCT 6-seater – రూ. 20.25 లక్షలు

Read Also : Hyundai Women’s Day 2023 Offers : మహిళా దినోత్సవం 2023.. మహిళా కస్టమర్ల కోసం హ్యుందాయ్ స్పెషల్ ఆఫర్లు.. అసలు మిస్ చేసుకోవద్దు..!