Tecno Camon 20 Pro 4G : టెక్నో Camon 20 ప్రో 4G ఫోన్ వస్తోంది.. డిజైన్, కీలక ఫీచర్లు లీక్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

Tecno Camon 20 Pro 4G : భారత మార్కెట్లోకి అతి త్వరలో టెక్నో Camon 20 ప్రో 4G ఫోన్ రానుంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ముందే డిజైన్, కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. లాంచ్ తేదీ తెలియదు కానీ, ఈ 4G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే..

Tecno Camon 20 Pro 4G Launch (Photo : Google)

Tecno Camon 20 Pro 4G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి 4G ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. టిప్‌స్టర్ (Tipster) కొత్త లీక్ రివీల్ చేసింది. రాబోయే డివైజ్ అద్భుతమైన డిజైన్‌తో రానుందని సూచిస్తుంది. ఈ ఫోన్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా రివీల్ చేసింది. (Tecno) ఇటీవల భారత మార్కెట్లో స్పార్క్ 10 Pro, స్పార్క్ 10 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో బేస్ స్పార్క్ 10 డివైజ్ ఆక్టా-కోర్ 7nm మీడియాటెక్ డైమెన్సిటీ 6020 SoC ద్వారా పవర్ అందిస్తుంది.

అయితే, ఈ ప్రో మోడల్‌కు MediaTek Helio G88 SoC సపోర్టు ఉంది. ఇటీవల కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ కీలక ఫీచర్లను రివీల్ చేసింది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో తొలిసారిగా ఈ ఫోన్ ఆవిష్కరించింది. ఏప్రిల్ 11న భారత మార్కెట్లో టెక్నో ఫాంటమ్ V ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కానుంది.

Read Also : Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

టిప్‌స్టర్ పరాస్ గుగ్లాని (@passionategeekz) నివేదిక ప్రకారం.. (Tecno Camon 20 Pro 4G) అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Camon 18 ప్రీమియర్‌ కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా భావిస్తున్నారు. Camon 20 ప్రీమియర్ 5G ఫొటోలు గతంలోనూ లీక్ అయ్యాయి. ఈ సిరీస్‌లో బేస్ Camon 20, Camon 20 Pro, Camon 20 ప్రీమియర్ 5G మోడల్‌లు ఆకర్షణీయమైన డిజైన్‌లతో ఉంటాయని నివేదిక తెలిపింది. ప్రీడాన్ బ్లాక్, సెరినిటీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో టెక్నో Camon 20 ప్రో 4G స్మార్ట్‌ఫోన్ ధర రూ. 20వేల లోపు ఉంటుందని అంచనా.

Tecno Camon 20 Pro 4G Launch (Photo : Google)

ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌తో పాటు 8GB వర్చువల్ RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. టెక్నో Camon 20 ప్రో 4G ఫోన్ 6.67-అంగుళాల Full-HD+ (1080 x 2400) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 13-ఆధారిత HiOS 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ని అందించనుంది. ఇందులో ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoC ద్వారా పనిచేయనుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా (Triple Camera) యూనిట్, టెక్నో Camon 20 Pro 4Gలో అందుబాటులో ఉంటుంది. నివేదిక ప్రకారం.. 64-MP ప్రైమరీ సెన్సార్, 2-MP వైడ్ యాంగిల్ లెన్స్, AI సెన్సార్‌ను కలిగి ఉంటుంది. రెండర్‌ల ప్రకారం.. డిస్‌ప్లే పైభాగంలో సెంటర్ హోల్-పంచ్ స్లాట్ 32-MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో రానుంది. టెక్నో Camon 20 సిరీస్ లేదా Camon 20 Pro 4G ఫోన్ పూర్తి వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు. లాంచ్ సమయానికి మరిన్ని ఫీచర్లు తెలిసే అవకాశం ఉంది.

Read Also : ChatGPT Tech Tips : ఒకే రోజులో రూ. 10వేలు సంపాదించడం ఎలా? అని అడిగితే.. ChatGPT ఎలాంటి టిప్స్ ఇచ్చిందో తెలిస్తే షాకవుతారు!