Tecno Camon Slim : ఇది కదా ఫోన్ అంటే.. 50MP కెమెరాతో టెక్నో కామన్ స్లిమ్ అదుర్స్.. ఫీచర్ల చూస్తే ఫిదానే.. ధర జస్ట్..
Tecno Camon Slim : టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో కామన్ స్లిమ్‌ను ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
Tecno Camon Slim
- టెక్నో కామన్ స్లిమ్‌లో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే
- 50MP ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ ప్రాసెసర్
- మల్టీ-సీన్ లైటింగ్ ఎఫెక్ట్స్ కోసం 354 మినీ ఎల్ఈడీలు
Tecno Camon Slim : టెక్నో లవర్స్‌కు గుడ్ న్యూస్.. టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో కామన్ స్లిమ్ వచ్చేసింది. ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ హీలియో G200 అల్టిమేట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
కామన్ స్లిమ్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు (Tecno Camon Slim) సపోర్టు ఇచ్చే 5,600mAh బ్యాటరీతో వస్తుంది. టెక్నో కామన్ స్లిమ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
టెక్నో కామన్ స్లిమ్ ధర ఎంతంటే? :
టెక్నో కామన్ స్లిమ్ ధర, లభ్యత వివరాలను టెక్నో ఇంకా రివీల్ చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ బర్గండీ రెడ్, జంగిల్ గ్రీన్, న్యూ మాండ్రియన్, ప్రిజం బ్లాక్, వాన్ గో బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
టెక్నో కామన్ స్లిమ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
టెక్నో కామన్ స్లిమ్ 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1224×2720 పిక్సెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16.2పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు 3 ఆండ్రాయిడ్ అప్డేట్ అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
కామన్ స్లిమ్‌లో మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ అందిస్తుంది. 12-లేయర్ కూలింగ్ సిస్టమ్ అందిస్తుంది. ఇందులో 3,205 చదరపు మిల్లీమీటర్ల స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ ఛాంబర్, మొత్తం 13,828 చదరపు మిల్లీమీటర్ల కూలింగ్ ఏరియా ఉన్నాయి.
Read Also : IndiGo Cabs : విమానం ఎక్కేవారికి పండగే.. ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది.. జస్ట్ రూ. 49కే రైడ్ బుకింగ్..!
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
కామన్ స్లిమ్‌లో బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, సింగిల్ ఫ్లిప్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ కెమెరా యూనిట్లో మల్టీ-సీన్ లైటింగ్ ఎఫెక్ట్స్ కోసం 354 మినీ ఎల్ఈడీలు ఉన్నాయి.
ఈ లైట్లు ఇన్కమింగ్ కాల్స్, మెసేజ్‌లు లేదా ఛార్జింగ్ స్టేటస్‌కు ఇండికేటర్లుగా పనిచేస్తాయి. యూజర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, NFC, Wi-Fi, బ్లూటూత్, GPS, ఎఫ్ఎమ్ రేడియో, USB టైప్-సీ పోర్ట్, ఓటీజీ ఉన్నాయి. ఇందులో యాంబియంట్ లైట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ కంపాస్, జియోమాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.
ఈ ఫోన్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69+, IP68 రేటింగ్ ఉంది. MIL-STD-810 మన్నికతో కూడా వస్తుంది. ఇందులో 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,600mAh బ్యాటరీ ఉంది. కొలతలు 162.8mm పొడవు, 77.7mm వెడల్పు, 6.39mm మందం ఉంటుంది.
