Tecno Phantom X2 5G Phone : టెక్నో ఫాంటమ్ X2 5G స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలైందోచ్.. ఇండియాలో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Tecno Phantom X2 5G Phone : భారత మార్కెట్లో టెక్నో ఫాంటమ్ X2 5G ఫోన్ సేల్ మొదలైంది.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఫస్ట్ టైం సేల్ మధ్యాహ్నం 12PM నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో సౌదీ అరేబియాలో లాంచ్ అయింది.

Tecno Phantom X2 5G Phone : టెక్నో ఫాంటమ్ X2 5G స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలైందోచ్.. ఇండియాలో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Tecno Phantom X2 5G goes on sale in India _ Check price, offer and more

Updated On : January 9, 2023 / 7:58 PM IST

Tecno Phantom X2 5G Phone : భారత మార్కెట్లో టెక్నో ఫాంటమ్ X2 5G ఫోన్ సేల్ మొదలైంది.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఫస్ట్ టైం సేల్ మధ్యాహ్నం 12PM నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 9000 ప్రాసెసర్‌తో వస్తుంది.

వెనుకవైపు 64MP కెమెరాతో వచ్చింది. 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. Tecno ఫాంటమ్ X2 5G ఒకే మోడల్‌లో 8GB RAM, 256GB స్టోరేజీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 39,999గా ఉంది. కొనుగోలుదారులు ఫోన్ మూన్‌లైట్ సిల్వర్, స్టార్‌డస్ట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ భారత మార్కెట్లో మొదటిసారిగా అమెజాన్‌లో Tecno Phantom X2 5G అందుబాటులోకి వచ్చింది.

టెక్నో Phantom X2 5G ఫోన్ 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల కర్వ్డ్ AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. హ్యాండ్‌సెట్ Mali-G710 MC10 GPUతో 4nm MediaTek డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8GB LPDDR5 ర్యామ్‌తో వస్తుంది. 256GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది.

Read Also : Tecno Phantom X2 5G : టెక్నో మొబైల్ నుంచి అత్యంత ఖరీదైన 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Tecno ఫాంటమ్ X2 5G Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా HiOS 12.0 పై రన్ అవుతుంది. కెమెరాల విషయానికి వస్తే.. హ్యాండ్‌సెట్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. f/2.2 ఎపర్చరు, 2MP సెన్సార్‌తో 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో వచ్చిన f/1.65 ఎపర్చరుతో 64MP ప్రధాన కెమెరాతో వస్తుంది.

Tecno Phantom X2 5G goes on sale in India _ Check price, offer and more

Tecno Phantom X2 5G Phone : Tecno Phantom X2 5G goes on sale in India

సెల్ఫీలు, వీడియో కాల్ విషయానికి వస్తే.. Tecno Phantom X2 5G f/2.45 ఎపర్చర్‌తో 32MP కెమెరాతో వస్తుంది. Wi-Fi 2.4G, 5G & Wi-Fi 6, బ్లూటూత్ 5.3, GPS, OTG, NFC, USB టైప్-C పోర్ట్ ఫోన్‌లో కొన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. డివైజ్ 5,160mAh బ్యాటరీతో సపోర్టుతో వస్తుంది.

Tecno Phantom X2 5G 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందిస్తుంది. 20 నిమిషాల్లో డివైజ్ 0 నుంచి 50శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది. హ్యాండ్‌సెట్ బరువు 210 గ్రాములు, కొలతలు 164.61mmx72.65mmx8.9mm వరకు ఉంటుంది. డివైజ్‌లో సెన్సార్‌లు సెన్సార్, కంపాస్, సిక్స్-యాక్సిస్ గైరో సెన్సార్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, త్రీ-యాక్సిస్ యాక్సిలెరోమీటర్ యాంబియంట్ లైట్ సెన్సార్ అనే మరెన్నో ఆకర్షణీయమైన సెన్సార్లు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : India 6G Technology : 5G కన్నా ముందే 6G వచ్చేస్తోంది.. ఇండియాకు ఎప్పుడో తెలిసిందోచ్!