Tecno Spark 20 Pro 5G : భారీ కెమెరాతో టెక్నో స్పార్క్ 20ప్రో 5జీ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Tecno Spark 20 Pro 5G : ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 11 నుంచి విక్రయానికి వస్తుంది. దేశంలోని వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటుంది. టెక్నో కూడా పరిచయ ఆఫర్‌ను అందిస్తోంది.

Tecno Spark 20 Pro 5G : భారీ కెమెరాతో టెక్నో స్పార్క్ 20ప్రో 5జీ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Tecno Spark 20 Pro 5G Launched

Tecno Spark 20 Pro 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కంపెనీ స్పార్క్ సిరీస్‌లో 20ప్రో 5జీ ఫోన్ వచ్చేసింది. భారీ రియర్ కెమెరాతో సరికొత్తగా ప్రవేశించిన ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 2023లో లాంచ్ అయిన 4జీ మోడల్‌తో పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌తో వస్తుంది.

Read Also : CMF Phone 1 Launch : కొత్త సీఎంఎఫ్ ఫోన్ 1 చూశారా? స్పెషిఫికేషన్లు అదుర్స్, భారత్ ధర ఎంతంటే?

ఈ ఫోన్ మొదట ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్‌లలో గత నెలలో లాంచ్ అయింది. ఇప్పుడు భారత మార్కెట్లో కూడా లాంచ్ అయింది. స్పార్క్ 20 ప్రో 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌తో అమర్చి 108ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. 10 5జీబ్యాండ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

భారత్‌లో టెక్నో స్పార్క్ 20ప్రో 5జీ ధర ఎంతంటే? :
దేశంలో టెక్నో స్పార్క్ 20ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంబిల్ట్ స్టోరేజ్ కలిగిన హై స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999కు అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు స్టార్‌ట్రైల్ బ్లాక్, గ్లోసీ వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 11 నుంచి విక్రయానికి వస్తుంది. దేశంలోని వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటుంది. టెక్నో కూడా పరిచయ ఆఫర్‌ను అందిస్తోంది. వినియోగదారులు రూ. 2వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో పాటు యూపీఐ, పేపర్ ఫైనాన్స్‌పై పొందవచ్చు.

టెక్నో స్పార్క్ 20ప్రో 5జీ స్పెసిఫికేషన్‌లు :
టెక్నో స్పార్క్ 20ప్రో 5జీ అనేది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (2,460×1,080 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్, మాలి-జీ57 ఎమ్‌సీ2 జీపీయూ 8జీబీ ర్యామ్ 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత హాయ్ఓఎస్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. టెక్నోస్పార్క్ 20ప్రో 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇందులో ఎఫ్/1.8 ఎపర్చరుతో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ డెప్త్ సెన్సార్, సహాయక లెన్స్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరా 30ఎఫ్‌పీఎస్‌తో 1440పీ వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ 8ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

టెక్నో స్పార్క్ 20ప్రో 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీతో పాటు 33డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సొల్యూషన్‌ను కలిగి ఉంది. 10డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీ ఎల్టీఈ, 10 5జీ బ్యాండ్‌లు, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియోలకు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ53 రేటింగ్‌ను కలిగి ఉంది.

Read Also : Moto G85 5G Launch : మోటో G85 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?