Tecno Spark 8T: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతుంది. టెక్నో స్పార్క్ 8T(Tecno Spark 8T) పేరుతో కంపెనీ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తుంది.Tecno నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్ Tecno Spark 8T టీజర్ వీడియోని డిసెంబర్ 9న విడుదల చేసింది కంపెనీ.
ఈ ఫోన్ వచ్చే వారం భారత్‌లో విడుదల కానుండగా.. లాంచ్‌కు ముందు, Tecno Spark 8T ప్రీ-బుకింగ్ డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12గంటల నుంచి స్టార్ట్ కానుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇండియా నుంచి ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ఉండనుండగా.. ఇందులో ఫోటోగ్రఫీ కోసం వెనుక 50MP డ్యూయల్ AI కెమెరా ఉంది. ఫోన్‌లో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డాట్ నాచ్ డిస్‌ప్లే ఇవ్వబడింది. ఈ ఫోన్ స్టైలిష్ మెటల్ డిజైన్‌లో వస్తుంది. అట్లాంటిక్ బ్లూ, టర్కోయిస్ సియాన్, కోకో గోల్డ్, ఐరిస్ పర్పుల్ స్టైలిష్ వంటి నాలుగు కలర్ ఆప్షన్‌లలో ఫోన్ వస్తుంది. దీని ధర 10వేల లోపే ఉండొచ్చు.
#SparkOfBigDreams అనే క్యాప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుంది.
Get ready for a spark to boost your big dreams, #SparkOfBigDreams Coming Soon.