Tecno Spark Go 2024 : భారత్‌కు టెక్నో స్పార్క్ గో 2024 ఫోన్ వచ్చేస్తోంది.. ధర, కీలక స్పెషిఫికేషన్లు లీక్..!

Tecno Spark Go (2024) : భారత మార్కెట్లోకి టెక్నో కంపెనీ నుంచి సరికొత్త మోడల్ 2024 ఫోన్ వచ్చేస్తోంది. ఈ కొత్త ఫోన్ లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు, డిజైన్ వివరాలు లీకయ్యాయి.

Tecno Spark Go (2024) Price in India, Specifications Tipped; Design Leaked

Tecno Spark Go (2024) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ టెక్నో(Tecno) నుంచి స్పార్క్ గో (2024) త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ 2023 ఏడాది ప్రారంభంలో జనవరిలో భారత మార్కెట్లో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ గో (2023)కు అప్‌గ్రేడ్ వెర్షన్ రానుంది. 2023 మోడల్ క్వాడ్-కోర్ మీడియాటెక్ హెలియో A22 SoC, 10W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

2024 స్పార్క్ గో మోడల్ స్పెసిఫికేషన్, డిజైన్ రెండర్‌లను సూచించే లీక్ మార్కెటింగ్ మెటీరియల్‌లను టిప్‌స్టర్ షేర్ చేశారు. టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ (@passionategeekz) ట్విట్టర్ పోస్ట్‌లో షేర్ చేసారు. టెక్నో స్పార్క్ గో (2024) భారత్‌లో సింగిల్ 4GB + 128GB వేరియంట్‌లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ధర కేవలం రూ. 6,999కు అందుబాటులో ఉండనుంది. లీక్ అయిన మార్కెటింగ్ మెటీరియల్స్ ఫొటోలలో హ్యాండ్‌సెట్ బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో అనే 4 కలర్ వేరియంట్‌లలో కనిపిస్తుంది.

Read Also : Whatsapp Block : వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడం ఎలా? ఇదిగో సింపుల్ టిప్స్..!

టెక్నో స్పార్క్ గో స్పెషిఫికేషన్లు (అంచనా) :
ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ కెమెరా యూనిట్ బ్యాక్ ప్యానెల్‌లోని టాప్ లెఫ్ట్ కార్నర్‌లో రెండు వృత్తాకార యూనిట్‌లలో డ్యూయల్ LED ఫ్లాష్‌తో పాటుగా ఉండనుంది. 6.6-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో, టెక్నో స్పార్క్ గో హెచ్‌డీ+(1,600 x 900 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. మాలి జీ57 జీపీయూతో చేసిన Unisoc T606 SoC ద్వారా ఫోన్ పవర్ అందించనుంది.

ఈ హ్యాండ్‌సెట్‌కు 4GB ర్యామ్, 4GB అదనపు వర్చువల్ ర్యామ్‌తో వస్తుందని భావిస్తున్నారు. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించనుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. టెక్నో స్పార్క్ గో (2024) ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఆధారిత HIOS 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ని రన్ చేసే అవకాశం ఉంది.

Tecno Spark Go (2024) Price in India

ఏఐ సపోర్టెడ్ కెమెరా ఫీచర్లు :
టెక్నో స్పార్క్ గో (2024) మోడల్ 13MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, డ్యూయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్ యూనిట్‌లతో పాటు అదనపు AI-సపోర్టెడ్ షూటర్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8ఎంపీ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. డ్యూయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్ యూనిట్‌లతో కూడా రానుంది.

టెక్నో స్పార్క్ గో (2024) ఫోన్ 5,000mAh బ్యాటరీతో బ్యాకప్ ఉండనుంది. USB టైప్-C సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు. డీటీఎస్ ఆడియో సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్ సెటప్‌తో వస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది.

Read Also : Nothing Festive Sale Offers : నథింగ్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. నథింగ్ ఫోన్ (2)పై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!