Whatsapp Block : వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడం ఎలా? ఇదిగో సింపుల్ టిప్స్..!
Whatsapp Block : మీరు వాట్సాప్ వాడుతున్నారా? వాట్సాప్‌లో మీ స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు.

How to know if someone has blocked you on WhatsApp
Whatsapp Block : ప్రపంచంలోని అత్యంత పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ (WhatsApp) ఒకటి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ సంవత్సరాలుగా అందరికి ఒక కమ్యూనికేషన్ టూల్‌గా మారింది. వాట్సాప్‌లో ఒక నిర్దిష్ట వ్యక్తితో కమ్యూనికేట్ చేయలేని సందర్భాలు ఉండవచ్చు.
అతను/ఆమె మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్ చేశారా అనే అనుమానం కలిగిస్తుంది. వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి కచ్చితంగా మార్గం లేనప్పటికీ, ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
లాస్ట్ సీన్ లేదా ఆన్‌లైన్ స్టేటస్ చూడలేరు :
ఎవరైనా మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్ చేసినప్పుడు.. మీరు వారి లాస్ట్ సీన్ లేదా ఆన్‌లైన్ స్టేటస్ చూడలేరు. ఎందుకంటే.. వాట్సాప్ మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసేందుకు ఈ డేటాను మీ నుంచి కనిపించకుండా హైడ్ చేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్ చేస్తే.. మీరు ఇకపై వారి ప్రొఫైల్ ఫొటోకు సంబంధించిన అప్‌డేట్‌లను చూడలేరు. మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడంలో వాట్సాప్ ఫీచర్ పనిచేస్తుంది.

Whatsapp Block : How to know if someone blocked you
మిమ్మల్ని బ్లాక్ చేసిన కాంటాక్టుకు పంపిన ఏదైనా మెసేజ్‌లు ఎల్లప్పుడూ ఒక చెక్ మార్క్ (మెసేజ్ పంపారని అర్థం) మాత్రమే కనిపిస్తాయి. రెండో చెక్ మార్క్‌ను ఎప్పటికీ చూపదు (మెసేజ్ డెలివరీ అయింది). మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి మీరు మెసేజ్ పంపినప్పుడు మీకు ఒక చెక్ మార్క్ మాత్రమే కనిపిస్తుంది. మెసేజ్ ఒక చెక్ మార్క్ ఉంటే.. మెసేజ్ పంపినట్టు అర్థం చేసుకోవాలి. కానీ అది డెలివరీ కాలేదు. ఎందుకంటే.. బ్లాక్ చేసిన కాంటాక్ట్‌కి మెసేజ్ డెలివరీ చేయకుండా వాట్సాప్ నిరోధిస్తుంది.
మీరు ఏవైనా వాట్సాప్ కాల్స్ చేసినా వెళ్లవు :
మిమ్మల్ని బ్లాక్ చేసిన ఎవరికైనా మీరు కాల్ చేయడానికి ప్రయత్నిస్తే.. వాట్సాప్ కాల్ వెళ్లదు. ఎందుకంటే కాల్ కనెక్ట్ కాకుండా వాట్సాప్ నిరోధిస్తుంది. ఒకే కాంటాక్టుపై మీరు ఈ సంకేతాలలో అనేకం చూసినట్లయితే.. వారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు. అయితే, పైన పేర్కొన్నట్లుగా.. ఈ సంకేతాలు కచ్చితమైన రుజువు కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం.
ఉదాహరణకు.. ఎవరైనా తమ లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ డిసేబుల్ చేసి ఉండవచ్చు లేదా వారి ఇంటర్నెట్ కనెక్షన్‌తో సమస్యలను కలిగి ఉండవచ్చు. అయితే, మీరు ఒకే కాంటాక్టు కోసం ఈ సంకేతాలలో అనేకం చూసినట్లయితే.. వారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు.
Read Also : Whatsapp Channel Updates : మీ వాట్సాప్ ఛానల్ అప్‌డేట్స్ ఎలా ఫార్వార్డ్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్