Telegram Gets Custom Notification Sounds, Message Translation And Other Features
Telegram New Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సరికొత్త ఫీచర్లతో వచ్చింది. ప్రధాన పోటీదారు వాట్సాప్‌ను మించి అద్భుతమైన ప్రైవసీ ఫీచర్లను రిలీజ్ చేయనుంది. ప్రత్యేకించి కస్టమ్ నోటిఫికేషన్ సౌండ్స్, కస్టమ్ మ్యూట్ లిమిట్, టెలిగ్రామ్ ప్రొఫైల్ న్యూ ఆటో డిలీట్ మెనూ, BOT కోసం వెబ్ ఇంటిగ్రేషన్ వంటి మరెన్నో ఫీచర్లను తీసుకొస్తోంది. అంతేకాదు.. ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లలో రిప్లే ఆప్షన్లు, iOSలో మెరుగైన మెసేజ్ ట్రాన్సాలేషన్లు, Androidలో మెరుగైన (Picture-in-Picture) వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్‌లను అందించింది.
2021లో భారత్ టెలిగ్రామ్ యాప్ ఇన్‌స్టాలేషన్ ద్వారా 22 శాతంతో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. టెలిగ్రామ్ 2013 నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ WhatsApp రాకతో టెలిగ్రామ్ పెద్దగా పాపులర్ కాలేదు. వాట్సాప్ ప్రైవసీపరంగా సమస్యలు ఎదురైన నేపథ్యంలో టెలిగ్రామ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటినుంచి వాట్సాప్ యూజర్లు చాలామంది టెలిగ్రామ్ లోకి మారిపోతున్నారు. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త సర్వీసు నిబంధనలు, ప్రైవసీ విధానాలే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. వాట్సాప్ ప్రైవసీ విధానాల పట్ల యూజర్లు భయంతో టెలిగ్రామ్ ఎక్కువ సంఖ్యలో డౌన్ లోడ్ చేసుకున్నారు.
టెలిగ్రామ్‌లో త్వరలో రాబోయే ఫీచర్లు ఇవే..
Custom Notification Sounds :
టెలిగ్రామ్ యాప్ ద్వారా ఏదైనా సౌండ్ నోటిఫికేషన్ టోన్‌గా మార్చడానికి యూజర్లకు అనుమతిస్తుంది. చిన్న ఆడియో ఫైల్ అయినా లేదా వాయిస్ మెసేజ్ అయినా సరే.. యూజర్లు ఏదైనా మ్యూజిక్ లేదా మీమ్‌ల ద్వారా కస్టమ్ అలర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సౌండ్ లిస్ట్‌లో యాడ్ చేసిన సౌండ్‌లు ఏదైనా చాట్‌లో వినియోగించుకోవచ్చు. అలాగే టోన్‌లు ప్రస్తుతం 5 సెకన్లలోపు 300 KB సైజులో ఉన్న ఆడియో ఫైల్‌లు వాయిస్ మెసేజ్‌లను సపోర్ట్ చేస్తాయి’ అని కంపెనీ తెలిపింది.
Telegram Gets Custom Notification Sounds, Message Translation And Other Features
Custom mute durations :
ఇంతకుముందు, టెలిగ్రామ్‌లో 8 గంటలు లేదా 2 రోజులు చాట్‌లను తాత్కాలికంగా మ్యూట్ చేసే ఫీచర్ ఉండేది. కొత్త అప్‌డేట్ ద్వారా మిడ్ డే నిద్ర లేదా పొడిగించిన వెకేషన్ వంటి నిర్దిష్ట వ్యవధిలో నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది.
Auto-Delete Menu in Profiles :
మీ చాట్‌లో సంభాషణను మరింత గోప్యంగా లేదా హైడ్ చేయడం, ఏదైనా చాట్‌ని ఆటోమాటిక్ గా డిలీట్ చేసేందుకు టెలిగ్రామ్ కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఆటో డిలీట్ మెనూ ఫీచర్ సాయంతో యూజర్లు కొన్ని నిర్ధిష్ట సమయాలను సెట్ చేయవచ్చు. ఏదైనా చాట్‌ను ఏదైనా సమయానికి ఆటోమాటిక్ డిలీట్ అయ్యేలా 2 రోజులు, 3 వారాలు, 4 నెలలు వరకు ఇలా సెట్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇలాంటి సౌకర్యవంతమైన టైమర్ సెట్టింగ్‌లను తీసుకురానుంది.
Replies in Forwarded Messages :
టెలిగ్రామ్ యూజర్లు.. ఇతర చాట్‌లకు మెసేజ్‌లను ఫార్వార్డ్ చేస్తున్నప్పుడు రిప్లే ప్రివ్యూలను చూసుకోవచ్చు. ఆ మెసేజ్ మరింత ప్రైవసీగా మార్చేందుకు ఫార్వార్డ్ చేసిన వారి పేరు లేదా మీడియా క్యాప్షన్ హైడ్ ఆప్షన్ కూడా యూజర్లకు అందించనుంది.
Message translations on iOS :
iOS అప్‌డేట్‌లో translations ఫీచర్‌కు మరింత సాంకేతికతను జోడించనుంది. టెలిగ్రామ్ యుక్రేనియన్ వంటి భాషలకు సపోర్టును కూడా అందిస్తోంది. iOS డివైజ్ లో టెలిగ్రామ్ ఇన్-యాప్ ట్రాన్సాలేషన్ ఫీచర్ యుక్రేనియన్ వంటి అనేక ఇతర భాషల నుంచి మెరుగైన నాణ్యమైన అనువాదాలకు సపోర్టు చేసేలా రూపొందించారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ వలె అదే భాషలను ట్రాన్స్ లేషన్ చేయగలదని టెలిగ్రామ్ కంపెనీ వెల్లడించింది.
Read Also : Telegram: ఫేస్‌బుక్ డౌన్.. టెలిగ్రామ్ దూసుకెళ్లింది.. సరికొత్త రికార్డు!