Telegram: ఫేస్‌బుక్‌ డౌన్‌.. టెలిగ్రామ్ దూసుకెళ్లింది.. సరికొత్త రికార్డు!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఒక్కసారిగా డౌన్ అయింది.. అదే సమయంలో రష్యాన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ దూసుకెళ్లింది. గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి బిలియన్ల ఇన్ స్టాల్ చేసుకున్నారు.

Telegram: ఫేస్‌బుక్‌ డౌన్‌.. టెలిగ్రామ్ దూసుకెళ్లింది.. సరికొత్త రికార్డు!

Telegram Crosses One Billion Installs On Google Play Store

Telegram billion install : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఒక్కసారిగా డౌన్ అయింది.. అంతే.. అదే సమయంలో రష్యాన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ దూసుకెళ్లింది. గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి బిలియన్ (రూ.100కోట్లు)కు పైగా ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్నారు. తద్వారా టెలిగ్రామ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఈ టెలిగ్రామ్‌ను రష్యాకు చెందిన పావెల్‌ దురోవ్‌ 2013లో స్థాపించారు. అ​క్టోబర్‌ 4వ తేదీన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మూడు సర్వీసులు ఒక్కసారిగా డౌన్‌ అయ్యాయి. ఇదే టెలిగ్రామ్‌కు కలిసొచ్చింది. ఫేస్‌బుక్‌ డౌన్‌ కావడంతో సుమారు 70 మిలియన్ల మంది కొత్త యూజర్లు టెలిగ్రామ్‌ బాట పట్టారు. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో బిలియన్ల మంది టెలిగ్రామ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
Google Pixel 6 Prices Leak : లాంచింగ్ ముందే లీక్.. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ధర తెలిసిందోచ్!

శాన్‌ఫ్రాన్సిస్‌కో సెన్సార్ టవర్ డేటా ప్రకారం.. 2021 ఏడాదిలో ఆగస్టు నెలలో టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డౌన్‌లోడ్‌ చేరుకుందని పేర్కొంది. బిలియన్‌ డౌన్‌లోడ్ దాటిన యాప్స్‌ జాబితాలో వాట్సప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్ సరసన ఇప్పుడు టెలిగ్రామ్‌ కూడా చేరింది. టెలిగ్రామ్‌ భారత మార్కెట్‌లో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌ సంపాదించిందని సెన్సార్ టవర్ పేర్కొంది.

భారత్‌, రష్యా, ఇండోనేషియాలో టెలిగ్రామ్‌ ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి. 2021 ఏడాదిలో యాప్‌ ఇన్‌స్టాల్ భారత్‌ నుంచి 22 శాతం నమోదు కాగా.. రష్యా 10 శాతం, ఇండోనేషియా 8 శాతంతో టెలిగ్రామ్‌ రికార్డు క్రియేట్ చేసింది. 2021 మొదటి ఏడాదిలో 214.7 మిలియన్ యూజర్లు టెలిగ్రామ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. 2020తో పోలిస్తే 61 శాతం మేర అత్యధికంగా టెలిగ్రామ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు.
Electric Car : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 750 కి.మీ ప్రయాణం